Hyderabad: తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెరుగుతున్నాయి.. ప్రస్తుతం ఆర్టీసీలో 810 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. జంట నగరాల పరిధిలో ఇప్పటికే 300 బస్సులు తిరుగుతున్నాయి.. ఇవ్వాళ మరో 65 ఈవీ బస్సులు రోడ్డెక్కనున్నాయి.. సికింద్రాబాద్ కొండాపూర్ మధ్య 14 బస్సులు, సికింద్రాబాద్ ఇస్నాపూర్ మధ్య 25 బస్సులు, సికింద్రాబాద్ బోరబండ రూట్ లో 8 బస్సులు, సికింద్రాబాద్ నుంచి రామయంపేట్ 6 బస్సులు, సికింద్రాబాద్ టు గచ్చిబౌలి ఎనిమిది బస్సులు, సికింద్రాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ వరకు 4 బస్సులు ప్రయాణికులకు సేవలందించనున్నాయి.. జనవరి చివరి నాటికి అందుబాటులోకి మరో 175 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి.. జనవరి నాటికి నగరంలో మొత్తం 540 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి పరుగులు పెట్టనున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడి డీజిల్ బస్సుల్ని జిల్లాలకు పంపించాలని ప్రణాళికలు రూపొందించింది.
READ MORE: Kohli-Rohit: రోహిత్, విరాట్‌ల కంటే గొప్పవారు ఎవరున్నారు?.. గంభీర్పై హర్భజన్ ఫైర్!
రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. “రవాణా శాఖ తరుపున ఆర్టీసీ రాణిగంజ్ నుండి 65 బస్సులు ప్రారంభం చేసుకుంటున్నాం.. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట లలో ఇవి బస్సులు నడుస్తున్నాయి.. ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహా లక్ష్మీ పథకం ప్రారంభం చేసుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం.. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించుకున్నాం. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ ఇతర సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు.. వారందరికీ అభినందనలు.. ఇప్పటికీ 251 కోట్ల మంది మహిళలు,8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారు.. హాస్పిటల్ లు ,విద్యా, దేవాలయాలు , ఉద్యోగాలు బంధువుల ఇంటికి ఇలా ప్రయాణాలు చేశారు.. దేవాదాయ శాఖ ఆదాయం మహా లక్ష్మీ పథకం ద్వారా పెరిగింది.. 2 సంవత్సరాల్లో ఇప్పుడున్న 40 శాతం బస్సులు కొనుగోలు చేయడం జరిగింది.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్టీసీ బస్సులను మహిళను యజమానులను చేసింది.. ఢిల్లీ లో నివాస యోగ్యం లేకుండా కాలుష్యం ఉన్న పరిస్థితి ఉంది.. ఇక్కడ అలాంటి పరిస్థితి రాకుండా రవాణా శాఖ ఈవీ పాలసీ , స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది.. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుంది.. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అనేక అంశాలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం..
ప్రయాణికులకు సౌకర్యంగా ఈవీ బస్సులు సమ్మక్క సారలమ్మ జాతర, శ్రీశైలం, యాదాద్రిలకు ప్రత్యేల బస్సులు నడుపుతున్నాం. నూతన బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధి చేసుకుంటున్నాం..” అని వెల్లడించారు.
READ MORE: Venky77 : విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47”