రాజస్థాన్ ఉదయపూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఐదుళ్లు పార్టీ పదవుల్లో ఉన్నవారిని పక్కన పెట్టడం.. అదే పదవిలో కొనసాగించడం సాధ్యం కాదని తేల్చేయడం.. కొత్త పదవులు ఇస్తారో లేదో స్పష్టత లేకపోవడం.. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ కలకలం రేపుతోంది. తెలంగాణ నుంచి ఏఐసీసీ కార్యదర్శులుగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీ, మాజీ ఎంపీ మధుయాష్కీకొనసాగుతున్నారు. ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఏంటి అన్నది పెద్ద ప్రశ్న. […]
రబీ ధాన్యం కొనుగోళ్లులో పెద్ద కుంభకోణం జరుగుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ బహిరంగ విమర్శలు చేశారు. ఇందుకు జిల్లా డీఆర్సీ, నీటి సలహా కమిటీ వేదికైంది. రైతుల అమాయకత్వాన్ని రైస్ మిల్లర్లు దోచేస్తున్నారనేది బోస్ ఆరోపణ. అయితే ఎంపీ చేసిన కామెంట్స్‌పై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ఇన్‌డైరెక్ట్‌గా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. తండ్రి భాస్కర్‌రెడ్డి […]
దేశం అప్పుల కుప్పలా ఎందుకు మారింది?రాష్ట్రాలు, కేంద్రం పోటీ పడి అప్పులు చేస్తున్నాయా?కోటి కోట్ల అప్పు తీరేదెలా?దేశం శ్రీలంకలా మారే ప్రమాదం ఉందా? అప్పుడే తెల్లారిందా అంటూ… అప్పునే తలుచుకుంటూ నిద్రలేస్తాం..ఓ ఫైవ్ ఉందా గురూ అనేది ఒకప్పటి మాటైతే.. ఇప్పుడది ఓ వందుందా అనే వరకు చేరింది. ఇది సామాన్యుడి చిల్లర అప్పుల సంగతి మాత్రమే. కానీ, ప్రభుత్వాల అప్పులు వంద లక్షల కోట్లను దాటేశాయి. అంటే దేశంలో ప్రతిఒక్కరూ… అప్పుడే పుట్టిన బిడ్డతో సహా […]
ఉమ్మడి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం టీఆర్ఎస్లో కొన్నాళ్లుగా వర్గపోరు తగ్గేదే లేదన్నట్టుగా సాగుతోంది.ఉపఎన్నిక తర్వాత అది మరీ ఎక్కువైందనే అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వర్గాలకు అస్సలు పడటం లేదు. పలు అంశాల్లో రెండు వర్గాలు ఆధిపత్యపోరు ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగార్జున సాగర్ పర్యటన గ్రూప్ వార్‌కు చెక్ పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన చేసిన కామెంట్స్‌పై ఎవరికి వారుగా […]
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత కుమ్ములాటలతోనే కాలం గడిచిపోయింది. పార్టీ నేతలే కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం..కామన్‌గా మారింది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిధార్థ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వర్గపోరు రక్తపోరుగా మారడానికి గీతలేవీ లేవు. సమయం సందర్భం వస్తే వైరిపక్షాలుగా మారి ఘర్షణ పడుతుంటారు. నందికొట్కూరు వైసీపీలో విభేదాలను పరిష్కరించడానికి […]
మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. మొదట్లో గౌతంరెడ్డి వారసురాలిగా ఆయన సతీమణి శ్రీకీర్తి రాజకీయాల్లోకి వస్తారని భావించారు. శ్రీకీర్తి అభ్యర్థి అయితే టీడీపీ కూడా తమ అభ్యర్థిని పెట్టబోమని సంకేతాలు ఇచ్చింది. దీంతో ఉపఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గౌతంరెడ్డి కుటుంబం.. శ్రీకీర్తి కాకుండా ఆయన సోదరుడు విక్రంరెడ్డిని అభ్యర్థిగా ఉంటారని ప్రకటించింది. ఇదే సమయంలో రాజమోహన్ రెడ్డి సోదరి కుమారుడు బిజీవేముల రవీంద్రరెడ్డి […]
బండారు లక్ష్మారెడ్డి. ప్రస్తుతం ఉప్పల్ trs నాయకుడు. మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు లక్ష్మారెడ్డి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మంత్రి హరీష్‌రావుకు కూడా సన్నిహితoగా ఉంటున్నారాయన. నాడు ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు సపోర్ట్ చేయాలని పార్టీ ఆదేశించడంతో లక్ష్మారెడ్డి సహకరించారు. GHMC ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో […]
సీదిరి అప్పలరాజు. కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి. ఇంఛార్జ్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టాక.. జిల్లా సమావేశాలలో ఆయన తీరు ప్రశ్నగా మారింది. అధికారులను ఇరుకున పెడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు చర్చగా మారుతున్నాయి. తాను స్పెషల్‌గా కనిపించాలనో ఏమో ప్రతి చిన్న విషయానికీ గంటల తరబడి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారట. ఎవరైనా అధికారులు మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతుంటే.. ఐ నో ఎవ్రీథింగ్.. ప్లీజ్ సిట్ డౌన్.. అని ఇంగ్లీష్‌లో ఏకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నట్టు చెవులు […]
అమెరికా అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం. అలాంటి అమెరికా దాదాపు రెండేళ్లు కరోనాతో విలవిల్లాడింది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు.. అక్కడే నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే అగ్రరాజ్యం కోలుకుంటోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గి.. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుందని.. అంతా మామూలు స్థితికి చేరుకుంటుందని అంతా భావించారు. అయితే అనుకున్నది ఒకటి అయితే.. ఇప్పుడు జరుగుతోంది మరొకటి. కరోనా సంక్షోభం తర్వాత గాడినపడుతుందనుకున్న అమెరికా ఆర్థిక […]
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీలో గ్రిప్ వచ్చేవరకు ఓపిక పట్టి.. అందరినీ మార్చేయాలని అనుకున్నారట. అయితే.. ఒకదాని వెనక మరో కార్యక్రమం రావడంతో ఆ ప్రక్రియకు కొన్నాళ్లు బ్రేక్ వేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడున్న డీసీసీలో దాదాపు 13 మందిని మార్చాలని అనుకున్నట్టు ప్రచారం జరిగింది. జిల్లాల్లో చురుకుగా పనిచేయని వారిని మార్చేయాలని కొంత కసరత్తు చేసినట్టు టాక్. ఇంతలో పార్టీ జాతీయ […]