బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. స్వామికార్యం.. స్వకార్యం అన్నట్టుగా గేర్ మార్చేశారు. అలజడులు.. విభేదాలతో సాగుతున్న తెలుగు తమ్ముళ్లను సెట్రైట్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో కూడా చంద్రబాబు జిల్లాకు వచ్చినా.. ఈ దఫా కాస్త భిన్నంగా పర్యటన సాగడం.. స్పీచ్లు ఉండటం చర్చగా మారింది. పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు ప్రకటన.. జిల్లాలో కొందరు నేతలకు ఉత్సాహాన్ని ఇస్తే.. మరికొందరిలో తీవ్ర నిరాశ.. నిస్పృహలు నింపాయట. దీనికితోడు జిల్లా […]
రాజమండ్రి వైసీపీలో ఇటీవల ఊహకందని చిత్రం పొలిటికల్ తెరపై కనిపించింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఎంపీ మార్గాని భరత్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా కలిసిపోయారు. ఈ మూడేళ్ల కాలంలో ఇద్దరు యువ నేతలు అనేకసార్లు రచ్చకెక్కారు. పార్టీ అధిష్ఠానం సైతం సయోధ్యకు విఫలయత్నం చేసింది. భరత్, రాజాలు కలవడం అసాధ్యమని అనుకున్నారు. కానీ.. విభేదాలను పక్కన పెట్టేసినట్టు ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. వైసీపీలో సంస్థాగతంగా చేపట్టిన […]
ఆపరేషన్ ఆకర్ష్. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో చేపట్టింది. ఇతర పార్టీల నేతలకు వలలు.. గేలాలు ఎన్నో వేస్తోంది. నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చలు అనేకం. అదిగో వచ్చేస్తున్నారు.. ఇదిగో వచ్చేస్తున్నారు అనే హడావిడి తప్పితే బీజేపీ గడప ఎక్కినవాళ్లు తక్కువే. ఇతర పార్టీలలో పెద్ద నేతలుగా చెలామణి అవుతున్న వాళ్లు బీజేపీతో టచ్లో ఉన్నారని.. కాషాయ కండువా కప్పుకోవడమే మిగిలిందని అనేక లీకులు ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. […]
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ రాజకీయం రసవత్తరంగా ఉంది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరన్నదానిపై అప్పుడే చర్చ మొదలైంది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది. దీంతో పాలకొల్లులో వైసీపీ వ్యూహం మారిపోయింది. గత మూడేళ్లుగా ఆ వ్యూహ రచనలో భాగంగా అనేక ఎత్తుగడలు వేసింది అధికారపార్టీ. అయితే పార్టీ కేడర్ ఆలోచన మరోలా ఉందట. వ్యూహాలు చాలు.. అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పేస్తే ఆ మేరకు పని మొదలుపెడతామని చెబుతున్నారట. […]
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే జోష్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.. కాబట్టి ఇక సెట్స్ పైకి వెళ్లటమే ఆలస్యం. ఇక SSMB 28వ ప్రాజెక్టుగా లాంచ్ అయిన ఈ సినిమా టైటిల్.. ఇదేనంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయతే ముందుగా ఈ […]
జ్ఞాన్వాపి మసీదు వివాదం కొత్తది కాదు. చాలా కాలంగా నడుస్తున్నదే. ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోందో తెలుసుకోవాలి. 1991లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఈ చట్టం చేశారు. 1991లో అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలనే ఉద్యమం సాగుతున్న సమయంలో అంటే, అద్వానీ రథయాత్ర, యూపీలాంటిచోట్ల మతరపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న రోజుల్లో, 1991 సెప్టెంబర్ 18న నాటి పివి […]
సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు హంతకుడని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రమంతా ఈ వ్యవహారం గందరగోళంగా మారినా, ఎమ్మెల్సీ లైట్ తీసుకున్నారు. ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. చివరకు ఆయన మెడకే ఉచ్చు బిగుస్తోంది. అయితే, ఇప్పుడు దీని వెనక ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఘటన జరిగినప్పుడు అనంతబాబు ద్వారంపూడిని కాంటాక్ట్ అయ్యారా?అనంత బాబు రెండు పదవులు రావడంలో ద్వారంపూడి కీ రోల్?సమస్య పరిష్కారమైందని అనంతబాబు ఊహించారా?ఎవరూ ఏమి చేయలేని స్థాయికి పరిస్థితులు […]
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట. ఆ పార్టీకి ఎంతో సెంటిమెంటుతో కూడుకున్న నియోజకవర్గం తిరుపతి. టీడీపీ స్థాపించిన సమయంలో ఎన్టీఆర్ సైతం తిరుపతి నుంచి పోటిచేసి గెలిచారు. అంతగా పార్టీకి బలమైన క్యాడర్ వుంది తిరుపతిలో. గత ఎన్నికల్లో సైతం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో నలభైవేల మెజారిటీతో ఓటమీ పాలైతే, ఇక్కడ మాత్రం కేవలం ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఓడింది. 2014లోనూ, టిడిపి మంచి మెజారిటితోనే గెలిచింది. అలాంటి నియోజకవర్గాన్ని ఇప్పుడు […]