నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. చంద్రబాబు నాయుడు కి సంబంధించిన ఫేస్ బుక్ ఖాతా జయహో చంద్రబాబు అనే పేరుతో ఉందని , ఆ ఖాతా నుంచి సోషల్ మీడియాలో దళిత ఎమ్యెల్యేలు అయిన తన ఫోటో, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ , సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంల ఫోటోలు పెట్టి, కింద భాగంలో మంత్రులు పెద్ది రెడ్డి , రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ఫొటోలతో దళిత ఎమ్యెల్యేలమైన మేము ప్రజలకు డబ్బులు ఎంతైనా తీసుకోండి వైసీపీకి మాత్రం ఓటు వేయవద్దు అంటూ ప్రచారం చేస్తున్నామని , ఒకవేళ ఓటు వేస్తే పెద్దిరెడ్డి , వెమిరెడ్డిల దౌర్జన్యాలను మేము అడ్డుకోలేమని, ఆయా దళిత నియోజక వర్గాలలో మీకున్న ఎకరా ,రెండెకరాలు సెజ్ లకు దారాదత్తం చేస్తారని చెపుతున్నట్లు అసత్య పోస్టుల మీద దళిత ఎమ్యెల్యేలను కించపరుస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలుండగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలం అయిన తమపై అసత్య ఆరోపణలు దళితులను హేళన చేయడమేనన్నారు. వైసీపీకి మేము నమ్మిన బంటులము గతంలో మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా…ఎంతగా అవమానించిన తాము జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచామన్నారు. దళితులు గా ఎవరైనా పుట్టాలనుకుంటారా… అన్న నీకు సవాల్ విసురుతున్న మరుజన్మకైనా నువ్వు దళితుడిగా పుట్టు అందులో ఉన్న మాధుర్యం ఏమిటో మమతానురాగాలేమిటో తెలుస్తుందన్నారు.
ఎమ్యెల్యే తో పాటు స్థానిక నాయకులు పోలీస్ స్టేషన్ ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ లు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చెప్పిన హామీలను నెరవేరుస్తూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఫై అసూయతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మామకు వెన్నుపోటు పొడిచి లాక్కునే పార్టీని ప్రజలు గంగలో కలిపేయడంతో చంద్రబాబుకు మతిస్థిమితం లేక చదుష్యంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా సొషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చంద్రబాబు నాయుడు ను వెంటనే అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.