తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల ఈ ఉదయం నుండి ఇందిరాపార్క్ వద్ద దీక్షకు ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.95 లక్షల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఆమె ఈ దీక్ష చేశారు. తెలంగాణలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయని కారణంగా మనోవేదనకు గురైన అనేక […]
శ్రీకాకుళం జిల్లాలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో వాలంటీర్లకు పురస్కారాలను ప్రధానం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు , పలువురు ఎమ్మెల్యేలు అధికారులు హాజరయ్యారు. ఐతే కార్యక్రమం జరుగుతున్న క్రమంలో 14 వార్డులోని ఐ జె.నాయుడు కాలనీకి చెందిన లొట్ల అనీల్ కుమార్ అక్కడికి వచ్చాడు . స్పీకర్ ను […]
ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. సెకండ్ వేవ్ కోవిడ్ తాజా పరిస్థితులు, కట్టడి, వైద్య చికిత్సా ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ పై సీఎం కీలక సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో […]
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న కరోనా బెడ్లకు అదనంగా, 25 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎలెక్టీవ్ ఆపరేషన్లను పోస్ట్ పోన్ చెయ్యాలని ప్రైవేటు ఆస్పత్రుల్లో మరిన్ని బెడ్స్ కరోనా కోసం పెంచాలని నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులను ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ కూడా సిద్ధం చేసింది. ఇక తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు భారీ స్థాయిలో […]
హైదరాబాద్ లో కరోనా బెడ్స్ దొరికే పరిస్థితి లేదు.. ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్లన్నీ పేషెంట్లతో నిండి పోయాయి.. లకిడికాపూల్ ఓ ఆస్పత్రిలో కరోనా కోసం 40 బెడ్లు కేటాయించారు. మొత్తానికి మొత్తం రోగుల తో నిండిపోవడంతో కొత్తవాళ్ళు చేరే పరిస్థితి లేదు. ఒక్కటి హాస్పిటల్ లోనే కాదు దాదాపు చాలా హాస్పిటల్స్ లో అదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో అన్ని హాస్పిటల్స్ లో చికిత్స మొదలు […]
టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు ఊరట లభించింది. రాజాం సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జిల న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి నెలా రెండవ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు పొందూరు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ క్రమంలో తమ్మినేని సీతారాం పై సంచలన వ్యాఖ్యలు చేశారు కూన రవికుమార్. భవిష్యత్తులో ఆమదాలవలస నడిరోడ్డుపై […]
విశాఖలో ఈరోజు ఉదయం ఆరు హత్యలు జరిగాయి. పాత కక్షలే దీనికి కారణం అని పోలీసులు చెబుతున్నారు. విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అందరూ నిద్రపోయే వరకు ఇంట్లోనే వేచి ఉన్నాడు. కుటుంబంలో అందరూ నిద్ర పోయిన తరువాత పదునైన ఆయుధంతో కుటుంబసభ్యుల మీద దాడి చేశారు. విచక్షణారహితంగా రహితంగా నరికి చంపాడు. […]
నాగార్జున సాగర్ లోని జానారెడ్డి ఇంట్లో ఇంఛార్జి ఠాగూర్ అధ్యక్షతన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం సభ, సాగర్ లో తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి… రేవంత్ హాజరయ్యారు. పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దు ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దని, సాగర్ నియోజకవర్గ పరిధి పొరుగున ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ […]
ఉగాది పండుగ పూట జగన్ ప్రకటించాలనుకున్న జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రకటించ లేకపోయింది. దీన్ని వచ్చే నెల 30వ తేదీ నాటికి వాయిదా వేసినట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్ ప్రకటన విషయంలో సీఎస్ స్థాయిలో కూడా అన్ని రకాల ప్రక్రియలు పూర్తి అయినా.. ఫైనాన్స్ శాఖ నుంచి క్లియరెన్స్ లేకపోవడం వల్ల అనుకున్న సమయానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేకపోయారనే చర్చ జరుగుతోంది. మే నెల 30 నాటికి సీెఎంగా జగన్ పాలనా పగ్గాలు చెపట్టి రెండేళ్లు […]
కూటి కోసం.. కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని వలస వచ్చిన కూలి జనాలకు.. పీడకల లాంటి రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కరోనా దెబ్బకు గతేడాది లాక్ డౌన్ సమయంలో చిందరవందరైన జీవితం, వారు పడిన కష్టం ఎవరూ మర్చిపోలేదు. సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో పలు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ దిశగా సాగుతుండటంతో…వలస జీవులకు మళ్లీ కష్టాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మహారాష్ట్ర సహా తెలుగు రాష్ట్రాల నుంచి తట్టాబుట్టా సర్దుకుని సొంతూళ్ల బాట […]