ఆంధ్రా భద్రాద్రి గా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది..రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తూ కేంద్ర పురావస్తుశాఖ మరియు టీడీటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు..అయితే ఈ నెల 21వ తేదీ నుంచి జరగాల్సిన ఒంటిమిట్ట రాములవారి కల్యాణం సైతం భక్తులు లేకుండా ఏకాంతంగా జరపాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది..రోజు రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి..ఈ నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడిచే కడప ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండో భద్రాద్రి గా పేరు పొందిన ఒంటిమిట్ట దేవాలయంలో ఈ నెల 21 నుంచి 29 వరకు కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరగాల్సి ఉంది..కానీ కోవిడ్ నిబంధనల పేరుతో ఆలయం నేటి నుంచి మే నెల 15 తేదీ వరకు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు…కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగానే స్వామివారి కల్యాణం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అధికారులు…కేంద్ర పురావస్తుశాఖ మరియు టిటిడి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు…వాస్తవానికి సీతారామ కళ్యాణ మహోత్సవానికి గతంలో 5 వేల మంది భక్తులను అనుమతించాలని అనుకున్నారు…కానీ కరోనా రోజు రోజుకూ విజృంభణ చేస్తున్న నేపథ్యంలో ఏకాంత సేవలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..26వ తేదీన స్వామివారి కల్యాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్నారని సమాచారం.
ఈ మేరకు ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేకుండా ఈనెల 21 నుంచి 29 వరకు బ్రహ్మోత్సవాలు,ఆలయం లోపల ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంతంగా నిత్య కైంకర్యాలు జరుపనున్నారు…ఒంటిమిట్ట రామాలయం తో పాటు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం, పుష్పగిరి ఆలయాలను కూడా మూసివేసారు…గత ఏడాది కూడా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ రామ నవమి బ్రహ్మోత్సవాలు భక్తులకు ప్రవేశం లేకుండా ఏకాంతంగానే నిర్వహించారు..తిరిగి ఈ యేడాది కూడా కోవిడ్ మూలంగా ఆలయంలో ఏకాంతంగా జరుపనుండడంతో భక్తులు నిరుత్సాహం చెందుతున్నారు. ఏది ఏమైనా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం చూసేందుకు భక్తులకు ఈ ఏడాది కూడా అవకాశం లేకపోవడంతో నిరాశా చెందుతున్నారు..