ప్రస్తుతం రెండో విడత కరోనా విజృంభించడంతో విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో వర్తకులు స్వతహాగా లాక్ డౌన్ ప్రకటించారు.. బొబ్బిలి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కిరాణా ,సిల్వర్, స్టీల్ మర్చంట్ కొబ్బరి మరియు కూరగాయల సముదాయాల వ్యాపారులు ముందుకు వచ్చి ప్రత్యేక లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరుస్తామని, సుమారు సుమారు వారం రోజుల పాటు ఉంటుందనీ కిరాణా వర్తక సంఘం కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు కింతలి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలని మరియు దుకాణాలకు వచ్చిన ప్రతి కొనుగోలుదారుడు విధిగా మాస్కులుధరించి శానిటైజ్ చేసుకుని, సామాజిక దూరం పాటించేలా సహకరించాలని తెలియజేశారు.