ఆర్థిక సాయం అంశంలో ప్రైవేట్ స్కూల్స్ బండారం బయట పడింది. 2 వేల ఆర్థిక సహాయం,25 కేజీల బియ్యం కోసం భారీగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ లో బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య లక్ష 45 వేలు, ఈ లెక్కలు ప్రైవేట్ స్కూల్స్ జిల్లా విద్యా సమాచార వ్యవస్థ లో పొందు పరచినవే. ఇందులో లక్షా 18 వేలు టీచింగ్ స్టాఫ్,27 వేలు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. కానీ ఆర్థిక సహాయానికి వచ్చిన దరఖాస్తులు 2 లక్షల 9 వేల 873గా ఉన్నాయి. ఇందులో ప్రైవేట్ టీచర్స్ 1 లక్షా 56 వేల 161కాగా, బోధనేతర సిబ్బంది 53 వేల 712 మంది ఉన్నారు. అయితే ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం 32 కోట్లు కాగా ఇది లక్షా 60 వేల మందికి మాత్రమే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్న వారందరికి ఇవ్వాలంటే మరో 10 కోట్లు కావాలి.
అంచనాలకు మించి వచ్చిన దరఖాస్తులు..
ప్రభుత్వానికి గతం లో ఇచ్చిన లెక్కలకు ఇప్పుడు ఎంట్రీ చేసిన వివరాలకు తేడా 65 వేలు దాకా ఉన్నాయి. విద్యా శాఖ అధికారుల దృష్టికి ఈ ప్రైవేట్ స్కూల్స్ వ్యవహారం వచ్చింది. దీంతో గతంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పుడు లెక్కలు ఇచ్చారు అని అంటున్నారు అధికారులు. వివిధ కారణాలతో తప్పుడు సమాచారం ప్రైవేటు యాజమాన్యాలు అప్లోడ్ చేసినట్టు చెబుతున్నారు. కొన్ని స్కూల్స్ జిల్లా విద్యా సమాచార వెబ్సైట్ లో తమ వివరాలు అప్డేట్ చేసినట్టు చెబుతున్నారు. ఇంతవరకు ఆ వెబ్సైట్ లో వివరాలు పొందుపరచని స్కూల్స్ కూడా తాజాగా ఎంటర్ చేసినట్లు గుర్తించారు. కొన్ని స్కూల్స్ వెబ్సైట్ లో చేంజ్ చేయక పోవడం తో గతంలో ఉన్న వారి కన్నా అదనంగా యాడ్ చేసిన సిబ్బంది ఎంటర్ కాలేదు.. తమకు చేంజ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రైవేట్ స్కూల్స్ కోరుతున్నాయి. అలానే తమ స్టాఫ్ కి కూడా 2వేల ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రి ప్రైమరీ …ఎయిడెడ్ స్కూల్స్ లో పనిచేస్తున్న నాన్ ఎయిడెడ్ సిబ్బంది కోరుతున్నారు.
డ్రైవర్స్ కూడా అడుగుతున్నారు…
మొదట టీచర్ గా విద్యార్హతలు ఉన్న వారికి ఆర్థిక సహాయం ఇచ్చే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితి చూస్తే స్కూల్స్ దగ్గర గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని స్కూల్స్ తమ స్టాఫ్ కి సర్ది చెప్పుకోవలసిన విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాల లు తొలగించిన సిబ్బంది లిస్ట్ లో తమ పేరు లేకుంటే ఆందోళనకు దిగే అవకాశం ఉందని అంటున్నారు.