JR NTR : జూనియర్ ఎన్టీఆర్ మీద బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎన్టీఆర్ లాంటి నటుడిని ఇప్పటి వరకు చూడలేదంటూ కితాబిచ్చాడు. వీరిద్దరూ కలిసి వార్-2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ నేరుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా హృతిక్ రోషన్ ఓ షోలో చెప్పాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఓ మ్యాజిక్ క్రియేట్ అవుతుందని తెలిపాడు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాతో మరో స్థాయిలో ఉంటారని తెలిపాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం చాలా సంతోషంగా ఉందన్నాడు.
Read Also : Prabhas : స్పిరిట్ కోసం బరువు తగ్గబోతున్న ప్రభాస్..?
‘జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడిని ఇప్పటి వరకు చూడలేదు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యాను. యాక్టింగ్ పరంగా అతని నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను. అతను ఒక గొప్ప నటుడు. అలాంటి వ్యక్తితో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు’ అంటూ చెప్పుకొచ్చాడు హృతిక్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. దేవర మూవీతో దాన్ని కంటిన్యూ చేశాడు. ఇప్పుడు వార్-2తో మరింతగా మార్కెట్ ను పెంచుకుంటాడని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.