ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో మెట్ట రాజకీయాలు డిఫరెంట్. ఇందులో జగ్గంపేట రాజకీయాలు ఇంకా ఆసక్తికరం. గడిచిన నాలుగు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే రెండుసార్లు కాంగ్రెస్, మరో రెండుసార్లు వైసీపీ గెలిచాయి. అభ్యర్థులు ఎవరైనప్పటికీ పార్టీలే జగ్గంపేటలో కీలకమని టాక్. 2004, 2009 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో జగ్గంపేట ప్రజలు వైసీపీని గెలిపించారు. 2004లో టీడీపీ నుంచి 2009లో పీఆర్పీ […]
చీరాల మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు పార్టీ మార్పుపై చాలాకాలం నుంచి వదంతులు షికారు చేస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచిన పాలేటి.. పలు పార్టీలు మారి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్‌తో కలసి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎవరికి మద్దతుగా నిలుస్తారో చెప్పలేమన్నది అభిమానుల మాట. ఆ మధ్య కొంతకాలం ఎమ్మెల్యే బలరామ్‌తో కొంత గ్యాప్ వచ్చినా మళ్లీ […]
ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార టీఆర్ఎస్లో వర్గపోరు పీక్స్‌కు చేరుకుంటోంది. ఎన్నికల వాతావరణం క్రమంగా రాజుకుని.. అందులో వర్గపోరు సెగలు రేపుతోంది. సమయం చిక్కితే చాలు అధిపత్యపోరు రకరకాల మలుపులు తిరుగుతోంది. చివరకు మేడే వేడుకలు, ఇఫ్తార్ విందుల్లోనూ తన్నుకునే వరకు వెళ్తున్నారు పార్టీ నేతలు.. వారి అనుచర వర్గాలు. నకిరేకల్‌లో ఎవరు ఎగ్జిట్ అవుతారు?నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని పరిణామాలు ఎప్పటికప్పుడు చర్చల్లో ఉంటున్నాయి. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య మూడేళ్లుగా […]
టీడీపీ ఎన్నికల వ్యూహంపై చర్చ టార్గెట్ బిగ్షాట్స్. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రస్తుతం అమలు చేయాలని అనుకుంటున్న ప్రణాళిక. ఇటీవల సీఎం జగన్ వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షులు, మంత్రులతో సమావేశమయ్యారు. పార్టీ బాధ్యతలను రీజినల్ కో-ఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షుల మీద పెట్టారు. మంత్రులకంటే వారే ఎక్కువ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షులు గెలవడంతోపాటు వారి పరిధిలోని ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను కూడా గెలిపించాల్సిన బాధ్యత వారికే […]
తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు సీనియర్ నాయకులతో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇటీవల హైదరాబాద్‌లోని MLA క్వార్టర్స్‌లో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కేవలం 9 మంది నేతలనే పిలిచారు ఠాగూర్. వీరితోపాటు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కూడా హాజరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ, ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీటింగ్‌కు వెళ్లారు. సాధారణంగా సమావేశం సీనియర్ నేతలకే పరిమితమైతే పెద్దగా […]
లావు శ్రీకృష్ణదేవరాయులు. నరసరావుపేట వైసీపీ ఎంపీ. ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల చుట్టూ నరసరావుపేట వైసీపీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఒకరు ఎగ్జిట్ అయ్యి.. ఇంకొకరు ఎంట్రీ ఇస్తారనే చర్చ అధికారపార్టీ వర్గాల్లో ఊపందుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కేంద్రంగా జరుగుతున్న ప్రచారం.. చర్చలు మరెంతో ఉత్కంఠ రేపుతోంది. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 2009లో నరసరావుపేట టీడీపీ ఎంపీ. 2014కు వచ్చేసరికి గుంటూరు పశ్చిమ నుంచి […]
వరసగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటోంది టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల క్షేత్రానికి కావాల్సిన రణతంత్రాన్ని పక్కాగా రచిస్తోంది. ఇందులో కీలకం ఐపాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం. గతంలో ప్రశాంత్‌కిశోర్ నేతృత్వంలోని ఐపాక్ పలు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసింది. ఆయా రాజకీయ పార్టీల నిర్మాణం.. కార్యక్రమాల అమలు క్షుణ్ణంగా అధ్యయనం చేసింది ఐపాక్. ఆ అనుభవంతోపాటు తెలంగాణలో ఉన్న పరిస్థితి… టీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో ఉన్న ప్లస్సులు.. మైనస్‌లపై గ్రౌండ్ రిపోర్ట్స్‌ను ఎప్పటికప్పుడు […]
గ్రాఫ్ పడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ అని సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పేయడంతో.. గోదావరి జిల్లాల్లో ఆ అంశం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు టికెట్ వస్తుంది? ఎవరికి రాదు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఏ నలుగురు వైసీపీ శ్రేణులు కలిసినా ఇదే చర్చ. దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేలపై కొందరు వ్యతిరేక ప్రచారాలు మొదలు పెట్టేస్తున్నారట. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో […]
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువ. అలాంటి పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుయాష్కీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా.. మహేష్‌గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను మహేష్‌గౌడే పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు బీసీ నేతలు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ సఖ్యత లేదు. నిత్యం కయ్యమే. గాంధీభవన్‌లో ఇద్దరు గౌడ్లు కలిశారంటే.. ఉప్పు నిప్పులా ఉంటారు. అసలు ఈ ఇద్దరికీ ఎక్కడ తేడా కొట్టింది అనేది ఎవరికీ అంతుచిక్కదు. […]
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. టీడీపీ అంచనాలకు అందని సెగ్మెంట్లలో ఇదొకటి. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిస్తే. తర్వాత వైసీపీ పాగా వేసింది. గతంలో టీడీపీ నుంచి బసప్ప, రంగయ్య, మసాలా ఈరన్నలు ఎమ్మెల్యేలుగా చేశారు. 2009 వరకు ఆలూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అప్పట్లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి బాగా పట్టు ఉండేది. దాంతో టీడీపీ ఎత్తులు పారేవి కాదు. కాంగ్రెస్ బలహీన పడినా టీడీపీలో గ్రూపు రాజకీయాలు సైకిల్‌ను ఎదగనివ్వలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ […]