దక్షిణాదిలో మరో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ.. తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. రాష్ట్ర నాయకత్వానికి పోరాడే సమస్యలు.. క్షేత్రస్థాయిలో నిరసనలు చేపట్టే అంశాలు అప్పగిస్తూనే.. ఎన్నికల రణతంత్రం మొత్తం జాతీయ నాయకత్వమే నడిపిస్తోందట. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ సంస్థాగత ఇంఛార్జులు తరచూ తెలంగాణకు రావడం.. పార్టీ నేతలతో సమీక్షలు చేస్తూనే ఇక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకుంటున్నారట. గ్రౌండ్ లెవల్ నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అప్పటికప్పుడు ప్లానింగ్ మార్చేస్తున్నట్టు సమాచారం. ఈ […]
శంకర నారాయణ. మాజీ మంత్రి. పెనుకొండ ఎమ్మెల్యే. కేబినెట్లో చోటు కోల్పోయిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లాకు వైసీపీ అధ్యక్షుడయ్యారు. ఆయనకు పార్టీ బాధ్యతలు కొత్త కాదు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సుదీర్ఘకాలంపాటు ఆయనే వైసీపీ చీఫ్. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి జిల్లాకు పార్టీ అధ్యక్షుడు. ఆ సమయంలో పార్టీలో ఎక్కడా.. ఎవరి మధ్యా విభేదాలు కనిపించలేదు. మాజీ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టాక అసలు సిసలైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు శంకర నారాయణ. వాటిపైనే […]
జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్.. కేరళ సీఎం పినరాయ్ విజయన్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. జార్కండ్ సీఎం హేమంత్ సొరేన్‌లను కలిసి జాతీయ రాజకీయాలు.. 2024 సార్వత్రిక ఎన్నికల గురించి చర్చించారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని స్పష్టం చేశారు గులాబీ దళపతి. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజకీయ […]
తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం కాంగ్రెస్ కు వెలితిగా ఉంది. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మూడోసారి ఎలాగైనా పవర్లోకి రావాలని పట్టుదలగా ఉంది. అయితే సంస్థాగత లోపాలు పార్టీని వెంటాడుతున్నాయి. నేతల మధ్య అనైక్యత కూడా శాపంగా మారింది. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలనలోనూ నేతలు తలోదారిగా ప్రవర్తిస్తుండటంతో.. శ్రేణులకు మింగుడుపడటం లేదు. స్వయంగా పీసీసీ చీఫ్ పర్యటల్ని కూడా కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వైఖరులే పార్టీ పుట్టి ముంచుతున్నాయని […]
వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్బీఐ నిర్ణయం ఎఫెక్ట్ స్టాక్ మారెట్లపై పడింది. సెన్సెక్స్ కుప్పకూలింది. నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. కరోనా విజృంభణ కారణంగా చాలా కాలంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ.. ఇప్పుడు ఉన్నట్టుండి పెంచేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పెంచిన పాలసీ రెపో రేటు పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. వృద్ధికి […]
పసుపు కండువా నీడలోనే నేతలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తెలుగుదేశంపార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ప్రస్తుతం ముగ్గురు నలుగురే ఉన్నారు. వారిలో ఒకరు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు. మిగతా వాళ్లు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి.. కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన వారంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. వీళ్లు మాత్రం పసుపు కండువా నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు. బక్కని నర్సింహులు టీ టీడీపీ […]
ఎమ్మెల్యే తలారి వైఖరిపైనే ఆరోపణలు గోపాలపురం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దగా రాజకీయ అలికిడి లేని నియోజకవర్గం. ఇటీవల జికొత్తపల్లి గ్రామంలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యతో ఒక్కసారిగా అటెన్షన్ తీసుకొచ్చింది గోపాలపురం. వైసీపీలోని గ్రూప్‌వార్ హత్యకు కారణం ఒక సంచలనమైతే.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై స్థానికులు దాడి చేయడం కలకలం రేపింది. దీంతో గోపాలపురంలో ఏం జరుగుతుంది? అక్కడ అధికారపార్టీలో వర్గపోరు చంపుకొనే స్థాయిలో ఉందా? అయితే దానికి కారణం ఎవరు? […]
రాజ్యసభ ఉపఎన్నిక నోటిఫికేషన్ మాటే లేదు..! టీఆర్ఎస్ నేత బండ ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ప్రకాష్ రాజీనామా చేయడం.. ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. రాజీనామా చేసే సమయానికి బండ ప్రకాష్‌కు రాజ్యసభ సభ్యుడిగా ఇంకా రెండేళ్లకుపైగా పదవీకాలం ఉంది. 2024 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉన్న ఆ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తే.. […]
నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గతంలో జనరల్ సెగ్మెంట్‌గా ఉన్నప్పుడు 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడమే ఆఖరు. ఆ తర్వాత నందికొట్కూరులో టీడీపీ జెండా ఎగిరింది లేదు. 2004లో కాంగ్రెస్ నుంచి గౌరు చరిత గెలిచారు. 2009కి వచ్చేసరికి నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ అయింది. 2012లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి టీడీపీకి రాజీనామా చేశాక సైకిల్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఎస్సీ సామాజికవర్గంలో టీడీపీకి బలమైన నాయకుడు లేకపోవడం పెద్ద […]
డబ్బు చెల్లిస్తారా? అప్పీల్‌కు వెళ్తారా? స్మితా సబర్వాల్. తెలంగాణ సీఎంవో కార్యదర్శి. హైకోర్టు ఆదేశాలతో తాజాగా చర్చల్లోకి వచ్చారు ఈ మహిళా ఐఏఎస్. 90 రోజుల్లో ప్రభుత్వానికి ఆమె 15 లక్షలు కట్టాలి. లేకపోతే ప్రభుత్వమే ఆమె నుంచి ఆ మొత్తాన్ని వసులు చేయాలన్నది ధర్మాసనం ఆదేశాలు. దీంతో ఈ కేసు పూర్వాపరాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 15 లక్షలు స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి కడతారా? లేక అప్పీలుకు వెళ్తారా? ఈ అంశంలో […]