సూటిగా సుత్తి లేకుండా కామెంట్ చేసేశారు TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూడేళ్ల గ్యాప్ తర్వాత పదునైన విమర్శలతో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై విరుచుకుపడ్డారు. ఇందూరులో పసుపు రాజకీయాన్ని వేడెక్కించడంతోపాటు.. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు నిజామాబాద్‌లో పొలిటికల్ గేర్ మార్చినట్టు చెప్పకనే చెప్పేశారు కవిత. 2019 ఎన్నికల తర్వాత అనేక పర్యాయాలు కవిత నిజామాబాద్‌లో పర్యటించినా.. ఎంపీ అరవింద్‌పై ఈ స్థాయిలో విరుచుకుపడింది లేదు. ఈ మాటల తూటాలు చూశాక రాజకీయ వర్గాల్లో […]
ఈయన పేరు శివరాజ్ పాటిల్. కర్నాటకలోని రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే. ఇక ఈయన.. రాజేందర్‌రెడ్డి. తెలంగాణలోని నారాయణపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇద్దరిదీ వేర్వేరు రాష్ట్రాలైనా.. సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో నారాయణపేటలో రాజేందర్‌రెడ్డిని ఓడించడానికి ప్రచారం చేస్తానని పాటిల్ అంటే.. అదే విధంగా కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. దీంతో ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది? ఎందుకు శపథాలు చేసుకుంటున్నారు అనేది చర్చగా మారింది. తెలంగాణలో […]
పెద్దాపురంలో టీడీపీ తరపున వరసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో హోంమంత్రిగా పనిచేశారాయ. చినరాజప్ప సొంతూరు అమలాపురంలో ఉంటుంది. అయితే అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కావడంతో… 2014 ఎన్నికల్లో తొలిసారి పెద్దాపురం బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి 1994,1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బొడ్డు భాస్కర రామారావు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బొడ్డు ఫామిలీ సైకిల్ […]
ఏపీలో వైసీపీ నాయకుల పరిస్థితి సిలబస్ పూర్తి చేసుకుని రివిజన్ చేసుకుంటున్న విద్యార్ధుల్లా ఉంది. మూడేళ్లు ప్రభుత్వ పాలనను రివైజ్ చేసుకుంటూనే.. వచ్చే రెండేళ్లు ఎన్నికలకు సమాయత్తం అవుతోంది పార్టీ. ఈ మూడేళ్లలో ప్రభుత్వ పనితీరే కాదు ఎమ్మెల్యేల పనితీరు కూడా కీలకమే. అందుకే పార్టీ హైకమాండ్ కొద్దిరోజులుగా సర్వేల ప్రక్రియ చేపట్టింది. చాలా మంది ఎమ్మెల్యేల ప్రొగ్రస్ రిపోర్ట్ 40 నుంచి 45 శాతం దాటడం లేదని.. సరి చేసుకోవాలని పార్టీ అధినేత సీఎం జగన్ […]
తెలంగాణలో రెండు రోజులపాటు సాగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనపై.. అధిష్ఠానానికి నివేదిక ఇచ్చే పనిలో పడ్డారు రాజకీయ వ్యూహకర్త సునీల్. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ప్రసంగంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. పార్టీ క్రమశిక్షణ గురించి చెబుతూనే.. టీఆర్ఎస్, బీజేపీతో దోస్తీ చేసే నాయకులు తమకు అవసరం లేదు.. వెళ్లిపోవాలనే కామెంట్స్ పార్టీ కేడర్‌కు బూస్ట్ ఇచ్చాయని గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే… కొందరు సీనియర్లు మాత్రం రాహుల్ వ్యాఖ్యలపై అసంతృప్తితో ఉన్నారట. […]
కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ఈ కామెంట్స్ అనేక సందేహాలకు.. చర్చకు కారణం అవుతున్నాయి. టీడీపీ వన్‌సైడ్ లవ్వు.. జనసేనను కన్నుగీటడం.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటన.. ఇంతలోనే అందరం కలవాలి.. త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. దీంతో బంతి బీజేపీ కోర్టులో పడింది. కాషాయ పార్టీ 2014ను రిపీట్ చేస్తుందా? బద్ధ […]
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు రూపాయి విలువ కూడా జీవనకాల కనిష్ఠానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడగుంటుతున్నాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయి. మరోవైపు నిరుద్యోగం పెరిగిపోతోంది. ధరల మోత మోగిపోతోంది. ఎక్కడ చూసినా ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయి. సామాన్యుడి బతుకు మరింత భారంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు […]
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చాలామంది బెర్త్ కోల్పోతే తానేటి వనితకు మాత్రం కొనసాగింపుతో పాటు ప్రమోషన్ లభించింది. ఓ మెట్టు పైకి ఎక్కారు. కీలకమైన హోంశాఖను దక్కించుకున్నారు. మొదటి కేబినెట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు తన మీద ఇంతటి బాధ్యత పెట్టినందుకు వనిత ఆనందపడ్డారు. కానీ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు వారాలు కూడా కాకుండానే వరస సంఘటనలు.. కామెంట్స్‌తో వివాదాలు ఇరుక్కుంటున్నారు. మహిళలపై వరస అఘాయిత్యాలతో పోలీస్ శాఖ గందరగోళంలో పడుతోంది. […]
రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో పదేళ్లపాటు అధికారం చేపట్టిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్‌ది ప్రతిపక్ష పాత్ర. రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటూ అనేకమంది నాయకులు ఎన్నికల సమయంలోనూ.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హ్యాండిచ్చేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకొనే పనిలో ఉంది. అయితే రాజధాని హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి విచిత్రంగా మారింది. జిల్లాల విభజన తరువాత కొత్త జిల్లాలకు నేతలు కరువైయ్యారు. అనేక ఆటుపోట్ల మధ్య […]
40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ… ఇప్పుడు ట్యూషన్ పెట్టించుకుని రాజకీయ పాఠాలు చెప్పించుకుంటోంది. అదీ ఒక్కరితో కాదు.. ఇద్దరితో. ఇప్పుడంతా పొలిటికల్ స్ట్రాటజిస్టుల ట్రెండ్ నడుస్తోంది. వ్యూహకర్తలు ఉంటే గెలుపు తీరాలకు చేరొచ్చనే భావన జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో బలంగా ఉంది. ఆ క్రమంలోనే టీడీపీ సైతం స్ట్రాటజిస్టులకు పార్టీని అప్పజెప్పింది. ముందుగా రాబిన్‌శర్మ టీమ్‌కు బాధ్యతలు అప్పగించారు. తాజాగా మరో స్ట్రాటజిస్ట్ కనుగోలు సునీల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే తెలంగాణలో కాంగ్రెస్‌కు కూడా వ్యూహకర్తగా […]