తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ నేతలు.. ఆ వేడిలో చేస్తున్న ప్రకటనలు రచ్చ రచ్చ అవుతున్నాయి. కాషాయ శిబిరంలో గుబులు రేపుతున్నాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతోంది. పాదయాత్రలో భాగంగా సభలు.. సమావేశాలు నిర్వహిస్తున్నారు నాయకులు. ఈ క్రమంలోనే మక్తల్‌లో సభ నిర్వహించారు. ఆ సభ.. సభలో చేసిన ప్రకటనలు ప్రస్తుతం బీజేపీలో చర్చగా మారాయి. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూనే ప్రస్తుతం […]
ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ప్రస్తుతం ఆ పార్టీ విబేధాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల గెలిచిన వైసీపీలో.. లోకల్‌గా గుర్తించని అంశాలు చాలా ఉన్నాయి. వైసీపీలోనూ ఒక రేంజ్లో అంతర్గత కలహాలు నడుస్తున్నాయి. అవి పార్టీ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఒక్కసారిగా బయటపడ్డాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, శ్రీ అన్నమయ్య జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు పెద్దిరెడ్డి. ఆ హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగానే షాక్ […]
తెలంగాణ రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. ఎన్నికలకు గడువు చాలా ఉన్నా.. పార్టీలు మాత్రం ఎవరి వ్యూహానికి వాళ్లు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక స్ట్రాటజీని అందజేశారట పార్టీ వ్యూహకర్త సునీల్. ఆ వ్యూహంలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌లు రహస్యంగా భేటీ అయ్యారట. ఈ సమావేశం గురించి అటు కాంగ్రెస్ నాయకులకు.. ఇటు TJS ప్రతినిధులకు కూడా తెలియదట. దాంతో రేవంత్, ప్రొఫెసర్ ఇద్దరూ ఎందుకు రహస్యంగా […]
టీడీపీ నేతలకు ఎవరి పార్టీ ఆఫీసు వాళ్లదే నూకసాని బాలాజీ. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన తర్వాత పసుపు కండువా కప్పుకొన్నారు. వైసీపీలోనూ ఆయనకు జిల్లా అధ్యక్షుడి హోదా కట్టబెట్టారు. జడ్పీ చైర్మన్ అభ్యర్దిగా ప్రకటించినా.. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యం కాక మరొకరు ఆ పోస్టును తన్నుకు పోయారు. చేసేదేమీ లేక టీడీపీలో చేరిపోయారు నూకసాని. అప్పటి నుంచి టీడీపీలో ఆయనకు సముచిత స్ధానమే దక్కింది. కొంతకాలానికి […]
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నేతల ల్యాండ్ పంచాయితీలు శ్రుతి మించుతున్నాయి. గుడిహత్నూర్.. ఇచ్చోడ మధ్య ఉన్న భూమి విషయంలో కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఆ ల్యాండ్ పంచాయితీ బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ ఇంటికి చేరడంతో.. సమస్యపై మాట్లాడేందుకు కొందరు పార్టీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు. ఒకానొక సమయంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగడంతో సమస్య మరో మలుపు తీసుకుంది. జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్‌రెడ్డి ఎంపీ ఇంట్లోకి దూసుకెళ్లారని ఎంపీ గన్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. […]
2019 నుంచి మారిన జమ్మలమడుగు రాజకీయం జమ్మలమడుగు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు రాజకీయాలు మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిల చుట్టూనే తిరిగేవి. 2019 ఎన్నికలతో వీరిద్దరికీ చెక్ పడింది. రాజకీయం కూడా మారిపోయింది. కొత్త వ్యక్తి డాక్టర్ సుధీర్‌రెడ్డి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. హోంశాఖ మాజీ మంత్రి మైసూరారెడ్డికి స్వయాన సోదరుడి కుమారుడే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. ఈ బంధుత్వం ఈ తొలిసారి ఎమ్మెల్యేకు ఎన్నికల్లో కలిసొచ్చింది. గత ఎన్నికల తర్వాత రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి […]
ఈయన ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. ఈయనేమో అదే జిల్లా జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్. అధికార టీఆర్ఎస్ నాయకుడు. జిల్లా అభివృద్ధిలో కలిసి సాగాల్సిన ఈ ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. ముఖ్యంగా కలెక్టర్ తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో రెండు వర్గాల నుంచి పోటాపోటీగా లేఖలు బయటకు వచ్చి దుమారం రేపుతున్నాయి. ఆ మధ్య జిల్లాలో ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన విలువ అధికారపార్టీ నేతలమైన […]
కేబినెట్లో కొత్తగా చోటు దక్కించుకున్న ఉషశ్రీచరణ్‌కు.. ఎంపీ తలారి రంగయ్య మధ్య మూడేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య వైరం పీక్స్‌కు చేరుకుంది. ఉషశ్రీచరణ్ ప్రస్తుతం మంత్రి అయినా.. ఎంపీ తగ్గేదే లేదన్నట్టుగా ముందుకెళ్తున్నారు. మంత్రి పదవి చేపట్టాక జిల్లాకు వచ్చిన ఉషశ్రీచరణ్.. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలందరినీ కలిసి మాట్లాడుతున్నారు. కానీ.. ఎంపీని మాత్రం పలకరించలేదు. మూడేళ్లుగా ఉన్న వైరానికే ఇద్దరూ ప్రాధాన్యం ఇస్తుండటం పార్టీలో చర్చగా మారుతోంది. కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీచరణ్ది కురుబ […]
మున్నూరు రవికి ప్లీనర్ ఎంట్రీ పాస్ ఎవరు ఇచ్చారు? మున్నూరు రవి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన కేసులో కీలక నిందితుడు. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు. టీఆర్ఎస్ పార్టీ పండక్కి వెళ్లాలని ఎంతోమంది గులాబీ కార్యకర్తలు ప్రయత్నించినా.. నియోజకవర్గాల నుంచి కొందరినే ఎంపిక చేశారు. వారికే ఆహ్వానాలు వెళ్లాయి. ఎమ్మెల్యేలు పంపిన జాబితాను వడపోసి.. లిమిటెడ్గానే ఇన్విటేషన్లు పంపారు నేతలు. ప్లీనరీకి వచ్చేవాళ్లకు బార్‌కోడ్‌తో కూడిన పాస్‌లు ఇచ్చారు. ప్లీనరీ ప్రాంగణంతోపాటు.. ప్లీనరీ […]
అయ్యన్నపాత్రుడు. ఇద్దరు మాజీ మంత్రులు సుదీర్ఘ కాలంగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి సాగిన సందర్భాలు లేవు. 2014-19 మధ్య అయ్యన్న, గంటా ఇద్దరు చంద్రబాబు కేబినెట్ మంత్రులు. ఆ సమయంలోనూ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు అరుదే. ఒకరిని ఇరుకున పెట్టేందుకు మరొకరు ఎత్తులు పైఎత్తులు వేసుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యన్న గళం విప్పుతుంటే.. రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నాలుగుసార్లు పార్టీ మారిన చరిత్ర గంటాది. విశాఖ […]