చీటింగ్ కేసులో ప్రముఖ మలయాళ దర్శకుడు, ప్రకటనల చిత్ర నిర్మాత వి.ఎ.శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ అయ్యారు. శ్రీవల్సం బిజినెస్ గ్రూపుకు చెందిన రాజేంద్రన్ పిళ్ళై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం 2006 నుండి ఇప్పటి వరకు జరిగిన డబ్బు లావాదేవీలపై పిళ్ళై ఈ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకుమార్ ఒక చిత్రం కోసం రాజేంద్రన్ పిళ్ళై దగ్గర 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. అయితే ఆ చిత్రానికి […]
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు హీరోగా నటించిన చిత్రం ‘మండేలా’. ఈ పొలిటికల్ సెటైరికల్ మూవీ సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ కు ఒక రోజు ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే టీవీలోనూ ప్రదర్శితమైంది. పదవిని దక్కించుకోవడం కోసం రాజకీయ నేతలు చేసే కుతంత్రాలన్నింటినీ ఈ సినిమాలో దర్శకుడు అశ్విన్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అప్పటి వరకూ ఊరిలో ఎవరికీ పట్టని ఓ బార్బర్ ఒక్కసారిగా ఓటు హక్కు సంపాదించుకోవడం, అతని ఓటే ఎన్నికల్లో కీలకం […]
బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే 4 బిగ్ బాస్ సీజన్లు ముగిశాయి. అందులో బిగ్ బాస్ తెలుగు సీజన్-1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-3,4 లకు మాత్రం కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. గడిచిన సీజన్లలో కంటెస్టెంట్లే కాదు హోస్టుల రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ గా […]
రకుల్ ప్రీత్ ఇప్పుడో హిందీ సినిమాలో కండోమ్ టెస్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ సోషల్ కామెడీ మూవీని రూనీ స్క్రూవాల ఆర్ఎస్వీపీ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. మరాఠీ దర్శకుడు, ‘బకెట్ లిస్ట్’ ఫేమ్ తేజస్ విజయ్ డియోస్కర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఆరేడు హిందీ సినిమాల్లో గ్లామర్ డాల్ గా నటించిన రకుల్ ప్రీత్ యాక్ట్ చేస్తున్న ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఇదే! ఈ చిత్రానికి ‘ఛత్రీవాలీ’ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. […]
యంగ్ హీరో సందీప్ కిషన్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘మాయావన్’కు సీక్వెల్ ను ప్రకటించారు మేకర్స్. సి. వి. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ కీలకపాత్రలు పోషించారు. 2017 డిసెంబర్ 14న ప్రేక్షకుల […]
సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు. సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్ […]
ప్రముఖ హాలీవుడ్ నటుడు జోక్విన్ ఫీనిక్స్ నటించిన ‘జోకర్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ చిత్రంలో జోక్విన్ ఫీనిక్స్ నటనకు అంతా ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ చిత్రనికిగానూ ఉత్తమ నటుడిగా తన మొదటి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు జోక్విన్ ఫీనిక్స్. అన్ని భాషల్లోనూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘జోకర్’కు సీక్వెల్ రాబోతోంది. ప్రస్తుతం ‘జోకర్’ సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రసిద్ధ నిర్మాణ సంస్థ వార్నర్ […]
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఒక్క శిల్పాశెట్టికి తప్ప. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమిషా, వియాన్ రాజ్ కుంద్రాలతో పాటు ఆమె అత్తమామలు, ఆమె తల్లి సునంద… వీరితో పాటు శిల్పాశెట్టి దగ్గర పనిచేసే ఇంకో ఇద్దరికీ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. “గత 10 రోజులుగా ఒక కుటుంబంగా మాకు చాలా […]
కోవిడ్-19 సెకండ్ వేవ్ తో దేశంలోని పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఎంతోమంది కరోనాతో కన్నుమూస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సాయం చేయడానికి బాలీవుడ్ ఒక్కటైంది. బాలీవుడ్ సినీ కార్మికులు, సాంకేతిక నిపుణులు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్‌మెన్, స్పాట్‌బాయ్‌లు తదితరులు… ఇలా 25,000ల మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,500ల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే […]