సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు. సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘పుట్టెనే ప్రేమ’ రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ను రామ్ మిరియాల ఆలపించగా… భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్ ‘పుట్టెనే ప్రేమ’పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.