ఇవాళ బుల్లితెరలో ఏదైనా కార్యక్రమం ఏ స్థాయిలో వీక్షకులను ఆకట్టుకుందనే అంశానికి గీటురాయి టీఆర్పీనే. దానిని ఆధారంగా బుల్లితెర వీక్షకులు తెలుగులోని ఏ యే సినిమాలను ఎక్కువగా ఆదరించారనే విషయాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకానొక సమయంలో వెండితెరపై పెద్దంత ప్రభావం చూపని సినిమాలను కూడా బుల్లితెర వీక్షకులు పట్టం కట్టిన సందర్భం కనిపిస్తుంది. ఇక వివరాలలోకి వెళితే, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ […]
విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. ఈ మాస్ ఎంటర్టైనర్ గతేడాది నవంబర్ 15న తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘విజయ్ సేతుపతి’ చిత్రం తాజాగా […]
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. కానీ ఒకటి రెండు సినిమాల టీంలు మాత్రం పరిమితమైన బృందంతో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి చైతన్య, రాశి, మిగిలిన యూనిట్ ఒక నెల క్రితం ఇటలీకి వెళ్లారు. తాజాగా […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత వర్మ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ తన హెల్త్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. చాలా తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని ఇటీవలే ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతానికి ఆయన ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ షేర్ […]
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంతకుముందు కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు చేసిన సాయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయన కష్టం అన్నవారికి కాదనకుండా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఎక్కడ కష్టం అనే మాట వినిపించిన అక్కడ వాలిపోతున్నారు. ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలోనూ సోనూసూద్ వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సోనూసూద్ చేస్తున్న సాయం ఆయనను పేదల పాలిట దేవుడిని చేస్తోంది. […]
ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ ఓ పాపులర్ రీమేక్ లో నటించబోతున్నారా ? అంటే అనే అవుననే సమాధానం విన్పిస్తోంది. తమిళ చిత్రం ‘మండేలా’ గత నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను అనిల్ సుంకర బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ‘మండేలా’ తెలుగు రీమేక్ లో సునీల్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ మేరకు సునీల్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ […]
ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ, వేర్, వై… ఎవరు, ఎక్కడ, ఎందుకు’ అనేది టైటిల్ అర్థం. ప్రియదర్శి, వివా హర్ష, సత్యం రాజేష్, రియాజ్ ఖాన్, దివ్య దృష్టి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తుండగా… కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘లాక్ డౌన్’ అనే ర్యాప్ సాంగ్ గింప్స్ […]
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా, సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ‘రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఒకే రోజున ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ చూసేయొచ్చు. థియేటర్లతో […]
2016లో విడుదలైన ‘డోన్ట్ బ్రీత్’ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఫెడెరికో అల్వారెజ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమౌతోంది. ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్న ‘డోన్ట్ బ్రీత్’ సీక్వెల్ ను ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నారు. చిత్ర యూనిట్ చెబుతున్న దానినిబట్టి… గుడ్డివాడైన కథానాయకుడు ఈ సీక్వెల్ లో ఓ ఫైర్ యాక్సిడెంట్ లో తన వాళ్ళను కోల్పోయిన ఓ అమ్మాయి చేరదీస్తాడు. ఆమెకు అన్నీ […]
మలయాళ చిత్రం ‘దృశ్యం -2’ హిందీ రీమేక్ హక్కుల్ని కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ సొంతం చేసుకున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా మంగళవారం తెలియచేశారు. ‘దృశ్యం -2’ చిత్రాన్ని పేషన్ తోనూ, కమిట్ మెంట్ తోనూ తెరక్కించాలని, అవి తమకు ఉన్నాయని, తమ సొంత నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ ద్వారా దీనిని నిర్మిస్తామని అన్నారు. అయితే… గతంలో ‘దృశ్యం’ సినిమాను హిందీలో పనోరమా స్టూడియోస్ తో పాటు వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ […]