చీటింగ్ కేసులో ప్రముఖ మలయాళ దర్శకుడు, ప్రకటనల చిత్ర నిర్మాత వి.ఎ.శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ అయ్యారు. శ్రీవల్సం బిజినెస్ గ్రూపుకు చెందిన రాజేంద్రన్ పిళ్ళై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం 2006 నుండి ఇప్పటి వరకు జరిగిన డబ్బు లావాదేవీలపై పిళ్ళై ఈ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకుమార్ ఒక చిత్రం కోసం రాజేంద్రన్ పిళ్ళై దగ్గర 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. అయితే ఆ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి డెవలప్మెంట్ లేదట. అలాగని శ్రీకుమారన్ ఆ డబ్బును వెనక్కి తిరిగి ఇవ్వలేదట. దీంతో పిళ్ళై పోలీసులను ఆశ్రయించారట. శ్రీకుమార్‌ను గురువారం అరెస్టు చేసి, ఈ రోజు (మే 7) కోర్టులో హాజరుపరిచారు. సెక్షన్లు 406 (క్రిమినల్ ట్రస్ట్ ఉల్లంఘనకు శిక్ష) కింద అభియోగం నిరూపించబడింది. ఇండియన్ పీనల్ కోడ్ 420 (మోసం మరియు నిజాయితీగా ఆస్తి పంపిణీని ప్రేరేపించడం) ప్రకారం ఆయనపై చర్య తీసుకోమన్నారు. శ్రీకుమారన్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్ట్ దానిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 2018లో మోహన్ లాల్ హీరోగా ‘ఒడియన్’ అనే భారీ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు శ్రీకుమారన్. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.