బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే 4 బిగ్ బాస్ సీజన్లు ముగిశాయి. అందులో బిగ్ బాస్ తెలుగు సీజన్-1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-3,4 లకు మాత్రం కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. గడిచిన సీజన్లలో కంటెస్టెంట్లే కాదు హోస్టుల రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఈ జూన్ లో 5వ సీజన్ ను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కు బ్రేక్ పడింది. కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దీంతో బిగ్ బాస్ సీజన్-5 ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్నారట. అంతేకాదు కరోనా ఇంతకుముందుకన్నా ఇప్పుడు అంత్యంత్య వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కంటెస్టెంట్లను సేఫ్ గా ఉంచడం అసాధ్యమని, కాదని ముందడుగు వేస్తే అది ఎలాంటి ప్రమాదానికైనా దారి తీయవచ్చనే కారణంతో బిగ్ బాస్-5ను వాయిదా వేశారట. ఈ షో ఆగస్టులోగానీ లేదా ఆ తరువాత మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాకనే పోటీదారులను ఫైనల్ చేయడం ప్రారంభిస్తారని సమాచారం.