Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానం పూర్తిగా విఫలమైందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పేర్కొనింది. ప్రజలు గౌరవంతో, భయంలేకుండా జీవించేందుకు కేంద్రం చేపట్టాల్సిన చర్యలను ఇప్పటి వరకు తీసుకోలేదని అన్నారు. అలాగే, ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక డాక్టర్ ఆత్మాహుతి బాంబర్‌గా మారి అమాయకుల ప్రాణాలు తీసిన విషయం బాధాకరం అన్నారు. కాశ్మీర్ యువత ఎప్పుడూ అలాంటి దారిలో నడవకూడదని ముఫ్తీ విజ్ఞప్తి చేశారు.
Read Also: Salman Khan: బిగ్‌బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ భావోద్వేగం.. ఆ వీడియో చూసి కన్నీటిపర్యంతం..
అయితే, ఒక చదువుకున్న యువకుడు ఆత్మాహుతి దాడికి దిగడం చాలా దురదృష్టం.. దీనిని ఆపాల్సిందేనని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌తో పాటు దేశంలో శాంతి ఏర్పాడలంటే చర్చలు, సంసమతుల్య విధానమే సరైన మార్గం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను నిరంతరం ఒత్తిడికి గురి చేయడం, కట్టడి చేయడం ద్వారా శాంతి సాధ్యం కాదని సూచించారు. 2019 తరువాత కాశ్మీర్ లో అమలులో చేస్తున్న విధానాలు ఫలించలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రధాన మంత్రి, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు అంగీకరించాల్సిన అవసరం పీడీపీ చీఫ్ ముఫ్తీ ఉందన్నారు.
Read Also: Rana Daggubati: బెట్టింగ్ యాప్ వివాదంపై.. మొదటి సారిగా స్పందించి రానా ..
ఇక, జమ్మూ కాశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వారి ఆవేదనను, ఆందోళనలను వినాలని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో గౌరవంగా జీవించాలని కోరుకుంటున్నారు.. వారికి సరైన గౌరవం, భద్రత కావాలి అని కోరింది. UAPA, PSA వంటి కఠిన చట్టాలు, NIAతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు ప్రజలను ఒత్తిడికి గురి చేయొద్దని సూచించింది.