యంగ్ హీరో సందీప్ కిషన్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘మాయావన్’కు సీక్వెల్ ను ప్రకటించారు మేకర్స్. సి. వి. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ కీలకపాత్రలు పోషించారు. 2017 డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మాయావన్’ యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రాజెక్ట్ Z” పేరుతో డబ్ చేశారు. తెలుగులోనూ పెద్దగా స్పందన రాలేదు ఈ చిత్రానికి. తాజాగా ‘మాయావన్’ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. తమిళంలో ‘మాయావన్ రీలోడెడ్’ అంటూ సినిమా టైటిల్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తిరుకుమారన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు సివి కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్ ను తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.