సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారని, బాలీవుడ్ దివా జాన్వి కపూర్ ఈ చిత్రంలో మహేష్ బాబుతో జోడి కట్టనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్ అయ్యింది. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28’కి దర్శకత్వం వహిస్తున్నందుకు గానూ హరిక అండ్ హాసిన్ క్రియేషన్స్ త్రివిక్రమ్‌కు రూ .15 కోట్లు పారితోకంగా చెల్లిస్తుందని తెలుస్తోంది. దీంతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులలో ఒకరి జాబితాలో చేరిపోతారు. ఇక మహేష్ బాబుకు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం భారీ పారితోషికం అందుతున్నట్లు సమాచారం.