25,000ల మంది సినీ కార్మికులకు సల్మాన్ ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్-19 సెకండ్ వేవ్ తో దేశంలోని పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఎంతోమంది కరోనాతో కన్నుమూస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సాయం చేయడానికి బాలీవుడ్ ఒక్కటైంది. బాలీవుడ్ సినీ కార్మికులు, సాంకేతిక నిపుణులు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్‌మెన్, స్పాట్‌బాయ్‌లు తదితరులు… ఇలా 25,000ల మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,500ల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌వైసిఇ) అధ్యక్షుడు బిఎన్ తివారీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. “మేము సల్మాన్ ఖాన్‌కు అవసరమైన వ్యక్తుల పేర్ల జాబితాను పంపించాము. ఆయన సాయం చేయడానికి అంగీకరించాడు. 35,000 మంది సీనియర్ సిటిజన్ కార్మికుల జాబితాను యష్ రాజ్ ఫిల్మ్స్‌కు పంపించాము. సహాయం చేయడానికి వారు కూడా అంగీకరించారని బిఎన్ తివారీ తెలిపారు. ఈ ప్రొడక్షన్ హౌస్ రూ.5000లతో పాటు నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబాలకు నెలవారీ రేషన్ సరకులు ఇవ్వనుంది అని తివారి పేర్కొన్నారు. ఇక ఇటీవలే సల్మాన్ ఖాన్ 5,000ల మంది ఫ్రంట్లైన్ యోధులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశాడు. ఈ నటుడు యువసేన నాయకుడు రాహుల్ కనాల్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పోలీసు సిబ్బంది మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికులు ఉన్నారు. కాగా మే 13న ఈద్ సందర్భంగా తెరపైకి రానున్న ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు సల్మాన్.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tags
- covid-19
- Salman Khan
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?