Goods Transport Bandh: ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 9వ తేదీ నుంచి అంటే.. రేపటి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.. టెస్టింగ్, ఫిట్‌నెస్ చార్జీలు తగ్గించాలని ఆందోళనకు దిగుతోంది.. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్‌నెస్ ఫీజులు పెంపు విరమించాలని బంద్‌కు పిలుపునిచ్చింది.. కేంద్ర ప్రభుత్వం పెంచిన లారీ టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులను వెంటనే తగ్గించకపోతే 12 ఏళ్లు దాటిన వాహనాలన్నింటినీ రోడ్లపైకి రానీయకుండా ఆపేసే పరిస్థితి వస్తుందని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు హెచ్చరించారు.
Read Also: Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి డీల్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
20 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్‌నెస్ ఫీజును కేంద్రం ఒక్కసారిగా రూ.33,040కు పెంచింది.. 12 ఏళ్లు దాటిన లారీలకు కూడా భారీగా రుసుములు పెరగడంతో వాహన యజమానులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈశ్వరరావు.. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్రం తప్పనిసరిగా అమలు చేయాలి అనే నిబంధన లేదని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై చొరవ తీసుకుని ఉపశమనం కల్పించాలి డిమాండ్ చేశారు.. ఫిటెనెస్ ఫీజులను తగ్గించకుంటే ఈ నెల 9 నుంచి నిరసన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆందోళన భాగంగా సరకు రవాణా, రైల్వే గూడ్స్‌షెడ్లు, షిప్‌యార్డ్స్‌లో నడిచే దాదాపు 10 వేల వాహనాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా సరకు రవాణాపై తీవ్రంగా పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు..