చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీలోని ఐటమ్ సాంగ్ బాస్ పార్టీ రేపు జనం ముందుకు రాబోతోంది. ఈ పాటను చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే చూసి దర్శకుడు బాబీని అభినందించారు.
డబ్బింగ్ సినిమాలు, 'లైగర్' మూవీకి సంబంధించిన వివాదాలపై మంగళవారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలను కమిటీ తీసుకుంది.
త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'ప్రేమదేశం' చిత్రంలో మధుబాల కీలక పాత్ర పోషించారు. అవకాశం ఇవ్వాలే కానీ కామెడీతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనూ తాను చేస్తానని ఆమె చెబుతున్నారు.
'కలర్ ఫోటో', 'సమ్మతమే' చిత్రాలతో నటిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి. తాజాగా ఆమె 'ఏవమ్' చిత్రంలో నాయికగా నటిస్తోంది. దీన్ని నటుడు నవదీప్ తన మిత్రుడు పవన్ గోపరాజుతో కలిసి నిర్మిస్తున్నాడు.
ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరాదేవి పెళ్లి రోజు. తన తల్లి లేని లోటును భరించలేకే, తన తండ్రి కృష్ణ ఆమెకు తోడుగా స్వర్గానికి వెళ్ళి ఉంటారని వారి కుమార్తె మంజుల భావోద్వేగ భరితమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ వీకెండ్ లో రెండు డబ్బింగ్ సినిమాలతో పాటు నాలుగు స్ట్రయిట్ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇందులో నరేశ్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'లవ్ టుడే', 'తోడేలు' చిత్రాల మీదే అందరి దృష్టి ఉంది.
'ఇంటింటి రామాయణం' మూవీతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన ఆంధాలజీ 'మీట్ క్యూట్'. దీనిని ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించారు. అర్బన్ బేస్డ్ గా సాగే ఈ అంథాలజీ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దీప్తి చెబుతున్నారు.
సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ సంస్థ 2022కి గానూ ప్రతిష్ఠాత్మక నేషన్స్ ప్రైడ్ అవార్డును సోనూసూద్ కు అందచేసింది. సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ అవార్డును సోనూసూద్ కు అందచేశారు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హను-మాన్' పాన్ వరల్డ్ మూవీ అని చెబుతున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. యువ కథానాయకుడు తేజ సజ్జాతో ఆయన తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది.