Meet Cute: బ్రేకప్ గురించి సత్యరాజ్ చెప్పిందేమిటి!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై అతని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆంథాలజీ ‘మీట్ క్యూట్’. అతి త్వరలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఆంథాలజీ టీజర్ శనివారం జనం ముందుకు వచ్చింది. దీన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించింది. అపరిచితుల క్యూట్ మీటింగ్స్, ఆహ్లాదకరమైన సంభాషణలు, భావోద్వేగాలని టీజర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ప్రేమ, కోపం, ఆశ, భయం, ఆశ్చర్యం, హార్ట్ బ్రేక్, నమ్మకం, సంతోషం ఇలా అన్నీ భావోద్వేగాలు ఇందులో ఆకట్టుకునేలా వున్నాయి.
బ్రేకప్స్ కు కారణంగా చెబుతూ సత్యరాజ్ చెప్పిన ఓ డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. ”చిన్న చిన్న గొడవలు వలన రిలేషన్ షిప్స్ ఫెయిల్ కావు. ఫైట్ చేయటం ఆపేసినప్పుడు ఫెయిల్ అవుతాయి” అనే చెప్పడం బాగుంది. దీప్తి గంటా తన తొలి ప్రయత్నంలోనే రచయిత్రిగా, దర్శకురాలిగా చక్కని ప్రభావాన్ని చూపించారు. ఆమె రచనలో పరిపక్వత కనబడింది. సిరిస్ లో కథలన్నీ అందరూ రిలేట్ చేసుకునేలా, అన్ని వర్గాలా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందించారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటింగ్, విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం… ఈ టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రీమియర్ డేట్ కోసం వ్యూవర్స్ ఎదురుచూడటం ఖాయం.
Also Read
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
- Ramayana: "డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?".. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
- Simbu - Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..