ERROR 500: ‘బిగ్ బాస్’ ఫేమ్ జెస్సీ సినిమా ట్రైలర్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jessie: బిగ్ బాస్ ఫేమ్ జస్వంత్ పడాల (జెస్సీ) నటించిన సినిమా ‘ఎర్రర్ 500’. సాందీప్ మైత్రేయ దర్శకత్వంలో యు. బాలరెడ్డి దీనిని నిర్మించారు. నక్షత్ర త్రినయని, హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. దీనిలో దర్శకుడు వి. ఎన్ ఆదిత్య , హీరో ఆకాష్ పూరితో పాటు బిగ్‌బాస్ రవి, సోహెల్, సిరి, కాజోల్, నేహా చౌదరి, అర్జున్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం వి. ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, ”ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ఏమిటని సాందీప్ గారిని అడిగాను. ‘సంతోషంస సురేష్ చూసారని చెప్పారు. మరో ఆలోచన లేకుండా మీ సినిమా చాలా సేఫ్ హాండ్స్ లో వుందని చెప్పాను. సురేష్ వండర్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్. ఆయన జడ్జ్ మెంట్ బావుంటుంది. ‘ఎర్రర్ 500’ జెస్సికి యాప్ట్ టైటిల్. ఒకేసారి మల్టిపుల్ టాస్క్ లు చేయగలడు. నేను రెగ్యులర్ గా బిగ్ బాస్ షో చూస్తాను. అందులో నాకు నచ్చినవారంతా ఈ వేడుక లో వుండటం ఆనందంగా వుంది. ఈ స్టేజ్ పైకి వస్తుంటే సడన్ గా ‘ఆదిత్య 369’ గుర్తుకు వస్తోంది. కాలానికి వెనక్కి వెళ్లి బిగ్ బాస్ సీజన్ 5, ముందుకు వెళ్లి టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ని చూస్తున్నట్లు అనిపించింది. ‘ఎర్రర్ 500’ ట్రైలర్ బ్రిలియంట్ గా వుంది. జెస్సి, సాందీప్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు. జెస్సీ మాట్లాడుతూ, ”ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. మా నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా దీన్ని నిర్మించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. దర్శకుడు సాందీప్ యూనిక్ కథతో దీన్ని రూపొందించారు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఫణి కళ్యాణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ వేడుకకి విచ్చేసిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు” అని అన్నారు. దర్శకుడు సాందీప్ మాట్లాడుతూ, ”జెస్సికి సినిమాలంటే చాలా ప్యాషన్. ఎంతో అంకిత భావంతో ఈ సినిమా చేశాడు. ట్రైలర్ లానే సినిమా కూడా చాలా వైవిధ్యంగా వుంటుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నవారంతా చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!