Yashoda: బాడీ డబుల్ కు సమంత ఒప్పుకోలేదట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: శుక్రవారం విడుదలైన సమంత ‘యశోద’ చిత్రానికి అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథను, ఆసక్తికరంగా తెరపై చూపించారని దర్శకులు హరి, హరీశ్ లను అందరూ ప్రశంసిస్తున్నారు. సమంత అయితే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేశ్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ సైతం తమ మనసులోని భావాలను మీడియాతో శనివారం పంచుకున్నారు. ఇండివిడ్యువల్ గా పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన వీరు… ‘యశోద’లో సహాయక పాత్రలు పోషించడం విశేషం. కథ నచ్చడం వల్లే ఈ పాత్రలు చేశామని వారు చెబుతున్నారు. ఇక సమంతతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేస్తూ, ‘బాడీ డబుల్ (డూప్) ఉపయోగించే అవకాశం ఉన్నా సమంత యాక్షన్ సీక్వెన్స్ ను స్వయంగా చేశారని, ఆమె డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేన’ని వీరు అంటున్నారు.
తొలుత కల్పికా గణేష్ మాట్లాడుతూ ”మనం కూర్చుని ఫిలాసఫీ చెబితే ఎవరూ వినరు. దాన్ని ఎంగేజింగ్‌గా చెప్పాలి. ఆ రకంగా చూస్తే ‘యశోద’ పర్ఫెక్ట్ ప్యాకేజ్! ఎంటర్‌టైన్‌మెంట్, క్యూట్ రొమాన్స్, ఎమోషన్స్… ప్రతిదీ ఉంది. పాటలు మాత్రమే మిస్సింగ్. ఈ కథను ప్రేక్షకులకు చెప్పాలి. అందుకే, కొన్ని ప్రాజెక్టుల్లో లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ… ఈ సినిమాలో ప్రెగ్నెంట్ లేడీ రోల్ చేయడానికి అంగీకరించాం. మహిళలకు మాత్రమే కాదు, మగవాళ్ళకు, పిల్లలకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలి. క్యారెక్టర్ చిన్నదా? పెద్దదా? అని ఆలోచించలేదు. కథ కోసమే సినిమా చేశా. చిన్న చిన్న పాత్రలు కథను ముందుకు తీసుకు వెళ్లాయి. మీరు నేను నటించిన ‘ప్రయాణం’ చూశారు కదా! దానికి ఈ క్యారెక్టర్ మరో వెర్షన్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ చేశాక… తెలుగు డబ్బింగ్ చెప్పాను. తమిళ్ డబ్బింగ్ కూడా చెబుతానని ఫైట్ చేశా. వాయిస్ టెస్ట్ చేశారు. కానీ, కుదరలేదు” అని అన్నారు.
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
దివ్య శ్రీపాద మాట్లాడుతూ, ”సమంత ‘నేను బాగా చేశాను’ అని చెప్పారు. నాకు అది బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా చూస్తే… క్యారెక్టర్ల పేర్లు అన్నిటికీ కృష్ణుడి కనెక్ట్ ఉంటుంది. సరోగసీ కాన్సెప్ట్ కొత్తది కాదని చెప్పడానికి పేర్లు ఆ విధంగా పెట్టారేమో!? షూటింగ్ విషయానికి వస్తే… సిలికాన్ బెల్లీతో చేయడం కష్టం అండి. ఇటువంటి కథతో సినిమా తీస్తున్నారనేది ఎగ్జైటింగ్ పార్ట్. క్యారెక్టర్ కోసం చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. లీలకు కృష్ణ అంటే ఎంత ప్రేమ అనేది చాలా వివరించారు. లీల ఎంత ఇన్నోసెంట్ అనేది నేను ఫీల్ అయ్యానో… అలా ప్రేక్షకుడు కూడా ఫీల్ అవ్వాలి. సమంత ఇంకా భవిష్యత్తులో చాలా చేయగలరు. సమంత మాత్రమే కాదు, ఈ సినిమా చూశాక మిగతా ఫిమేల్ ఆర్టిస్టులకు ఇటువంటి సినిమా చేసే ఛాన్సులు వస్తాయని, ఇటువంటి కథలు రాస్తారని ఆశిస్తున్నాను. ‘యశోద’ కథకు వస్తే… సినిమా ఎండ్ కార్డ్స్‌లో న్యూస్ క్లిప్పింగ్స్ చూపిస్తారు. సినిమాకు అదే మూలం” అని అన్నారు.
ప్రియాంక శర్మ మాట్లాడుతూ ”సినిమా షూటింగ్ చేసేటప్పుడు గర్భవతులుగా కనిపించడం కోసం మేమంతా సిలికాన్ బెల్లీ ఉపయోగించాం. దాంతో షూటింగ్ చేయడం కష్టమే. కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. అందుకని, ఎలా చేయగలను? న్యాయం చేస్తానా? లేదా? అని కొంత ఆలోచించాను. రెండు రోజులు ఆలోచించిన తర్వాత ఓకే చేశా. ఈ కథను నా దగ్గరకు పుష్ప గారు తీసుకొచ్చారు. ‘సినిమా విడుదలైన తర్వాత ఇటువంటి కథ చేయలేదు’ అని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదన్నారు. నాకు ఆ మాట నచ్చింది. ఓకే చేసేశా. ఇటువంటి కథలు అరుదు. ‘యశోద’ లాంటి కథల్లో నటించే అవకాశం ఎప్పుడో కానీ రాదు” అని చెప్పారు.
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!