అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే హోలీ కూడా రావడంతో చిత్రసీమలో డబుల్ థమాకా నెలకొంది. వివిధ చిత్రాల బృందాలు ఈ రెండు స్పెషల్ డేస్ సందర్భంగా ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళీ రాజు కన్నుమూశారు. వర్మలోని ప్రతిభను గుర్తించి ఆయన్ని సినిమా రంగంలో ప్రోత్సహించిన వారిలో మురళీ రాజు ప్రథములు. ఆయన తనయుడు మధు మంతెన ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు.
ఆనంద్ దేవరకొండ హీరోగా 'పుష్పక విమానం' తెరకెక్కించిన దర్శకుడు దామోదర ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో 'కన్యాకుమారి' సినిమాను తీస్తున్నాడు. తొలి చిత్ర నేపథ్యం తెలంగాణ కాగా, ఇప్పుడీ సినిమాకు శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ కావడం విశేషం.
కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న 'బెదురులంక 20212' చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. మణిశర్మ స్వరాలకు తగ్గట్టుగా ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాశారు.
మైత్రీ మూవీ మేకర్స్ నుండి రాబోతున్న తొలి ఓటీటీ ఫిల్మ్ 'సత్తి గారి రెండెకరాలు' టీజర్ విడుదలైంది. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను అభినవ్ దండా తెరకెక్కించాడు.
'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర నటించిన రెండో సినిమా 'ఓ సాథియా'. ఈ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా దీనిని నిర్మిస్తున్నారు.
యోగేశ్వర్, అతిథి జంటగా నటించిన 'పరారి' మూవీ ఈ నెలాఖరులో జనం ముందుకు రాబోతోంది. ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు చక్రి సోదరుడు మహిత్ నారాయణ సంగీతాన్ని సమకూర్చాడు.
మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన తొలి ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' ఆహాలో ఈ నెల 17న స్ట్రీమింగ్ కానుంది. 'పుష్ప' సినిమాలో నటించిన జగదీశ్ ప్రతాప్, రాజ్ తిరందాసు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.