Geeta Sakshigaa: నిజ ఘటనల ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోషనల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి నిర్మాత చేతన్ రాజ్ కథను కూడా సమకూర్చడం విశేషం. దీనికి ఆంధోని మట్టిపల్లి స్క్రీన్ ప్లే రాసి, దర్శకత్వం వహించారు. హోలీ సందర్భంగా మంగళవారం మేకర్స్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సినిమాను మార్చి 22న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ‘గీత సాక్షిగా జడ్జ్‌మెంట్ డే మార్చి 22న’ అని తెలియజేశారు. కంటెంట్ ప్రధానంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చరిష్మా కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా కథాంశం తిరుగుతుంటుందని మేకర్స్ తెలియజేశారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనితా చౌదరి, రాజా రవీంద్ర తదితరులు పోషించారు. వెంకట్ హనుమ నారిశెట్టి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి కిషోర్ మద్దాలి ఎడిటర్. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సమకూర్చారు.