'కింగ్ ఆఫ్ సోషల్ మీడియా' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. 20 మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగిన తొలి సౌతిండియన్ యాక్టర్ గా నిలిచాడు.
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'ఇంటింటి రామాయణం' చిత్రం స్పెషల్ షో ను ఈ నెల 5వ తేదీ కరీంనగర్ లో ప్రదర్శించ బోతున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ముందు అనుకున్నట్టు ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది.
రజనీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రజనీకాంత్ తో సినిమా తీస్తున్నట్టు ప్రకటించింది. దీనికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్నారు.
యువ కథానాయకుడు రామ్ కార్తీక్ కొత్త సినిమా 'ఔను నేనింతే' బుధవారం మొదలైంది. ఈ సినిమాతో ప్రిష హీరోయిన్ గా పరిచయం అవుతోంది. యూత్ తో పాటు పేరెంట్స్ కూ చక్కని సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు.
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం 'రావణాసుర' ఏప్రిల్ 9న రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
కన్నడలో 'బీగా'గా తెరకెక్కిన సైంటిఫిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగులో 'కరాళ'గా డబ్ అయ్యింది. ఈ సినిమాను అతి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విడుదల చేయబోతున్నారు.
'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక తెలుగులోనూ బిజీ అయిపోయింది. ఆమె నటించిన 'షికారు' గత యేడాది విడుదలైంది. ఇప్పుడు మరో రెండు మూడు మహిళా ప్రధాన చిత్రాలలో సాయి ధన్సిక నటిస్తోంది. అందులో ఓషో తులసీరామ్ రూపొందిస్తున్న 'దక్షిణ' షూటింగ్ పూర్తయ్యింది.