కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం గుర్తుకు వస్తుందని అలాంటి కుప్పంలో అప్రజాస్వామిక విధానాలతో తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని వైసీపీ నేతలు కుట్రలు పన్నుతు న్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార యంత్రాం గాన్ని ముందుండి నడిపిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజా తీర్పును వమ్ము చేయలేరన్నారు. కుప్పం అభివృద్ధికి తెలుగుదేశం ఎంతో కృషి చేసిందన్నారు. ప్రజలుత టీడీపీ, చంద్రబాబుకు అండగా నిలుస్తారని కొల్లు రవీంద్రా అన్నారు. ఇప్పటికే అధికారులు వైసీపీ నేతలు చెప్పి నట్టు ఆడుతున్నారని ఇది భావ్యం కాదని అధికారులు నిష్పపక్ష పాతంగా వ్యవహిరంచాలని ఆయన కోరారు. అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కొల్లు రవీంద్రా తెలిపారు.