భారతదేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలను విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశకంర్ కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్న సర్టిఫి కేట్లను గుర్తించాలని ఆయన కోరారు. జీసీసీ సెక్రటరీ జనరల్ నయేఫ్ ఫలాహ్ ముబారాక్ అల్ -హజరప్‌తో ఆయన సమా వేశం అయ్యారు. వీరిద్దరూ భారత్- జీసీసీ సంబంధాలపై సమీ క్షించి వాణిజ్యం, పెట్టు బడులపై చర్చించారు. నయేఫ్ ఫలాహ్ కువైట్ మాజీ ఆర్థిక మంత్రి. ఆయన 2020 ఫిబ్రవరిలో జీసీసీ సెక్రటరీ జనరల్‌గా నియమితుల య్యారు. ఆయన రెండు రోజులు భారత్‌లో పర్యటించేందుకు న్యూ ఢీల్లీ వచ్చారు. జైశంకర్, నయేఫ ఫలాహ్ భారత్-జీసీసీ సంబంధా లను మరింత బలోపేతం చేయడానికి చర్చించారని విదేశీ మంత్రి త్వ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
జీసీసీలో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక సహకారం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఈ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో భారత దేశానికి తిరిగి వచ్చిన వారు జీవనోపాధి కోసం ఈ దేశాలకు వెళ్లడానికి వీలుగా ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలని భారత్ కోరుతుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో భారతీయుల పై శ్రద్ధ వహించినందుకు, కోవిడ్ రెండో ప్రభంజనం సమయంలో ( ఏప్రిల్, మే) నెలలో వైద్యపరమైన సాయాన్ని అందించింనందుకు జైశంకర్ జీసీసీ దేశాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.