రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా రైతులను వాడుతున్నారని మం త్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అమరావతి రైతుల పాదయాత్ర, చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయాత్రకు చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని మంత్రి అన్నారు. చంద్రబాబు తాబే దార్లు న్యాయమూర్తులకు కళ్లకు గంతలు కట్టి యాత్ర చేస్తున్నారన్నా రు. పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, కర్త, క్రియ అన్ని చంద్ర బాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. ఈ యాత్ర పేరుతో తన బ్లాక్ మనీని చంద్రబాబు వైట్ మనీగా మార్చుకుంటున్నాడన్నారు.
పేదవారికి అమరావతి ప్రాంతంలో ఇళ్ళు ఇస్తామని ప్రభుత్వం చెబితే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని అడ్డుకున్న వాళ్ళు రైతు లు ఎలా అవుతారనిపేర్ని నాని ప్రశ్నించారు. ఏ నిజమైన రైతు ఈ రకంగా ఆలోచించడన్నారు. లోకేష్… చంద్రన్న దేవుడు అంటున్నా డని, ఎవరికి దేవుడో చెప్పాలన్నారు. లోకేష్‌ను మానసిక వైద్యులకు చూపించాలన్నారు. కుప్పంలో ఓటుకు 1500, 2000 రూపాయలు ఓటర్లకు ఇస్తు లోకేష్ తిరుగుతుందన్నది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. 1989 నుంచి ఇప్పటి వరకు కుప్పంకు చంద్రబాబు ఎమ్మెల్యేనే కదా…హంద్రీనీవా నీళ్లను ఎందుకు తీసుకు రాలేదో చెప్పా లన్నారు. రెండేళ్లల్లో ఏం పీకార్రా…అని లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఈ రెండేళ్లలో చంద్రబాబు కప్పంకు ఎందుకు ఒకసారి కూడా వెళ్లలేదు. తండ్రి, కొడుకులకు ఎన్నికలు రాగానే కుప్పం గుర్తుకు వచ్చిందా, తండ్రి, కొడుకులు నోరు తెరిస్తే బూతులే వస్తాయంటూ పేర్ని నాని వారిపై ఫైర్ అయ్యాడు.