పేర్ని నాని వర్సెస్ ప్రశాంత్ రెడ్డి.. ఏంటీ మాటల దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాలంటే వేడిగానే వుంటాయి. అందునా తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, విపక్షాల మధ్య అయితే ఇది మరీ వేడిగా వుంటుంది. ఏపీ తెలంగాణ మధ్య తాజాగా మాటల దాడి వేడిని పుట్టిస్తోంది. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకుని బ్రతకాల్సి వస్తుందని ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారని… కానీ నేడు ఏపీ సీఎం జగన్ కేంద్రం వద్ద బిచ్చమెత్తుకునే పరిస్థితి తలెత్తిందన్నారు ప్రశాంత్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధులు నిండుకోవడంతో కేంద్రం వద్ద చేతులెత్తి అడుక్కుంటోందని, అందుకే కేంద్రం ఏం చెప్పినా చేయడానికి జగన్ సిద్ధమయ్యారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నడవాలంటే కేంద్రం ఇచ్చే నిధులు తప్పనిసరన్నారు. అందుకే ఏపీలో మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశమంతా విద్యుత్ మీటర్లను వ్యతిరేకిస్తుంటే జగన్ మాత్రం కేంద్రం చెప్పిందంతా వింటూ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీ మంత్రి పేర్నినానికి మంట పుట్టించాయి.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ఇదిలా వుంటే.. పేర్ని నాని కూడా తనదైన రీతిలో స్పందించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి పేర్నినాని కౌంటరిచ్చారు. మాకు రావాల్సిన నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నాం. మాటి మాటికి ఢిల్లీ వెళుతున్న కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళుతున్నారంటూ మండిపడ్డారు పేర్నినాని. తెలంగాణలో వరి కొనుగోళ్ళ రచ్చ జరుగుతుంటే… ఈ కొత్త గొడవేంటని రాజకీయ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. విపక్షాలు మాత్రం కీలక విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి సిల్లీ విషయాలను తెరమీదకు తెస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!