టీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది రాష్ర్టంలో కాదని ఢీల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజే పీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో మాత్రం ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. ముందు వడ్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయ కులు కేంద్రం పై ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బీజే పీ, టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ధర్నాలు ఎవరి చెవుల్లో పూలు పెట్టడం కోసం చేస్తున్నాయో చెప్పాల్సిన అవసరముందన్నారు.
టీఆర్ఎస్ వాళ్లు ధర్నాలు చేస్తే పోలీసులు సహకరిస్తారు.. మేము ధర్నాలు చేస్తే అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనకపోతే తమకు అవకాశం ఇవ్వాలని రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు అంటున్నారని, ఆదిశగా ప్రభుత్వాలు ఎందు కు ప్రయత్నం చేయడం లేదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులపై చిత్తశుద్ధి లేదని తమ పబ్బం గడుపుకో వడం కోసమే ధర్నాల పేరిట అమాయక రైతులను మోసం చేస్తున్నా యన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పంతాలు మాని రైతులకు న్యాయం చేయాలని చాడ వెంకట్ రెడ్డి కోరారు.