దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ అనంతపురం జిల్లా వైద్య శాఖ అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలను వైద్య శాఖ అధికారులు తీసుకుంటున్నారు. మరోసారి కరోనా ముప్పు రాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారిపై ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిపై నిఘా పెట్టడంతో పాటు వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన 471 మందిని గుర్తించినట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిపారు.
వీరిలో తొలివిడతలో 252 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరింయట్ కాదా అనేది గుర్తించేందుకు నమునాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపినట్టు పేర్కొన్నారు. ఇంకా విదేశాల నుంచి ఎంత మంది వచ్చారనే దానిపై పూర్తిగా స్పష్టత రాలేదని, ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.