భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. అంబేడ్కర్‌తోనే దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. అంబేద్కర్ ముందు చూపుతోనే మన దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రిజర్వేషన్లను ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె పేర్కొన్నారు. కాగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వలనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వెనుబడిన వర్గాల ప్రజలకు ఇంకా రాజ్యాంగ ఫలాలు పూర్తి స్థాయిలో దక్కడం లేదని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ర్టం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదిగి రాష్ర్టానికి పేరును తీసుకురావాలని సూచించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వం పై బురద చల్లాలని చూస్తున్నాయని ఆమె అన్నారు. కాగా వరంగల్ సబ్ జైలును తరలించి అక్కడ ఎంజీంఎంను నిర్మించడం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని ప్రస్తుతం ఉన్న ఎంజీంఎంను స్ర్తీ శిశు సంక్షేమ శాఖకు కేటాయించినందుకు ఆమె కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు మానుకోవాలని మంత్రి సూచించారు.