మాస్క్ ధరిస్తున్న వారు 2శాతమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్, రెండో వేవ్ దేశాన్ని ఎంతగా వణికించిందో అందరూ మర్చిపోయారు. మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మాస్కు ధరించటం లేదనిఈ సర్వే తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మాస్క్ పెట్టుకునేవారి సంఖ్య సెప్టెంబర్‌లో 29శాతం పడిపోయిందని తెలిపింది. కరోనా వైరస్‌లలో అత్యంత వేగంగా వ్యాపించే లక్షణమున్న ఒమిక్రాన్ వైరస్ బయటపడినవేళ ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 364 జిల్లాల్లో 25వేల మంది నుంచి వివరాలు సేకరించారు. ”మీ ప్రాంతంలో బయట తిరుగుతున్నవారిలో ఎంతమంది మాస్క్‌లు పెట్టుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ఈ నేపథ్యంలో వచ్చిన సమాధానాల్ని క్రోడీకరించగా, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సరైన పద్ధతిలో మాస్క్‌లు ధరిస్తున్నవారు కేవలం 2శాతం మందే ఉన్నారు. ఎక్కడా ఎవరూ మాస్క్‌లు పెట్టుకోవటం లేదని సర్వేలో పాల్గొన్న 8 శాతం మంది చెప్పారు. దేశంలో ఇప్పటికే 21 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మాస్క్‌లు ధరించటం లేదని వచ్చిన సమాధానం తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తుంది. 5శాతం మంది మాస్క్‌ల్ని సరిగ్గా ధరిస్తున్నారు. సరిగ్గా ధరించనివారు 38శాతం మంది ఉన్నారు. ఏ తరహా మాస్క్‌లు ధరిస్తున్నారన్న ప్రశ్నకు, 63శాతం మంది బట్టతో చేసిన మాస్క్‌లు ధరిస్తున్నామని చెప్పారు. 21శాతం మంది ఒకసారి వాడిపడేసేవి, ఎన్-95 మాస్క్‌లు 8శాతం మంది, కెఎన్-95, డబ్ల్యూ-95 తరహా మాస్క్‌ల్ని 3శాతం మంది వాడుతున్నారని ఈ సర్వేలో తేలింది.
ఏది ఏమైనా మాస్క్‌లు ధరించడం అసరమని ఇప్పటికే ప్రభుత్వం మాస్క్ ధరించకుంటే రూ.1000 జరిమానా విధించిన విషయం తెల్సిందే.. స్వీయ రక్షణే ఈ వైరస్ నుంచి కాపాడుతుందని వైద్యులు పదేపదే చెబుతున్నా ప్రజల్లో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. ఇప్పటికైనా స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటించకున్నా, మాస్క్‌లు ధరించకుంటే మరోసారి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!