Virat Kohli: 2026లో విరాట్ కోహ్లీ ముందు మూడు భారీ రికార్డులు.. సాధిస్తాడా..?
- 2026లో కోహ్లీ ముందర మూడు భారీ రికార్డులు
- ఐపీఎల్‌లో 9,000 పరుగులు
- వన్డేల్లో 15,000 పరుగులు
- అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2025 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా 17 ఏళ్ల నిరక్షణకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో కలిసి ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు.. భారత జట్టుతో కలిసి చాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకున్నాడు. అంతేకాదు ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీనితో ఇప్పుడు 2026లో కోహ్లీ ముందర మరో మూడు కీలక మైలురాళ్లు సవాలుగా మారనున్నాయి. మరి ఆ సవాళ్లు, రికార్డుల సంగతేంటో చూద్దామా..
రో–కో దెబ్బకి 8 నిమిషాల్లోనే IND vs NZ తొలి వన్డే టికెట్స్ సోల్డ్ అవుట్..!
Also Read
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ఐపీఎల్‌లో 9,000 పరుగులు:
ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలవడానికి ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీకి కేవలం 339 పరుగులే కావాలి. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 259 ఇన్నింగ్స్‌ల్లో 8,661 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్ ఆల్‌టైమ్ టాప్ స్కోరర్ కూడా కోహ్లీనే. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 267 ఇన్నింగ్స్‌ల్లో 7,046 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే జట్టు ఆర్సీబీకి మాత్రమే ఆడాడు. గత మూడు ఐపీఎల్ సీజన్‌ల్లో ఏ సీజన్‌లోనూ అతను 600 పరుగుల కంటే తక్కువ చేయలేదు. ఇది చాలు అతని స్థిరత్వానికి నిదర్శనంగా చెప్పుకోవడానికి.
వన్డేల్లో 15,000 పరుగులు:
విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించే దిశగా దూసుకెళ్తున్నాడు. వన్డే క్రికెట్‌లో 15,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా మారే అవకాశముంది. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన క్రికెట్ గాడ్ ‘సచిన్ టెండూల్కర్’ మాత్రమే ఉన్నారు. సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 18,426 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 296 ఇన్నింగ్స్‌ల్లో 14,557 వన్డే పరుగులతో రెండో అత్యధిక స్కోరర్‌గా ఉన్నాడు. 15,000 పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే అతనికి ఇంకా 443 పరుగులు అవసరం.
Usman Khawaja: ఆస్ట్రేలియాకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ఏడ్చేసిన ఉస్మాన్ ఖ్వాజా
అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు:
అంతర్జాతీయ క్రికెట్ (టెస్టులు+వన్డేలు+టీ20లు)లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచే అవకాశం కూడా 2026లోనే ఉంది. ప్రస్తుతం అతను 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు చేశాడు. కుమార సంగక్కర చేసిన 28,016 పరుగులు రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి కేవలం 42 పరుగులే కావాలి. న్యూజిలాండ్‌తో జరిగే 2026 తొలి మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉండటంతో ఆ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..