Switzerland bar fire: అంతులేని విషాదం.. 47 మంది సజీవదహనం.. 115 మందికి గాయాలు
- స్విట్జర్లాండ్‌లో అంతులేని విషాదం
- క్రాన్స్-మొంటానా బార్‌లో అగ్నిప్రమాదం
- 47 మంది సజీవదహనం.. 115 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూఇయర్ వేళ స్విట్జర్లాండ్‌లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో ఊహించని విపత్తు సంభవించడంతో పెను విషాదం చోటుచేసుకుంది. లగ్జరీ స్కీ రిసార్ట్ బార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 47 మంది చనిపోగా.. 115 మంది గాయాలు పాలైనట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి ‘ఫ్లాష్ ఓవర్’ కారణంగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
నూతన సంవత్సరం వేళ క్రాన్స్-మోంటానాలోని ఆల్పైన్ రిసార్ట్‌లోని వందలాది మంది వినోదంలో మునిగిపోయారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకునేందుకు అందరూ ఒకే దగ్గరకు చేరారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొని కేకలు, అరుపులతో గడిబిడి జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి కాలిపోయారు. దాదాపు 47 మంది సజీవదహనం అయ్యారు. 115 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు.
అయితే పరిమిత స్థలంలో మండే పదార్థాలను అకస్మాత్తుగా మండించడం వల్లే పేలుడు సంభవించిందని.. దీంతో వేగంగా మంటలు వ్యాపించాయని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఫ్లాష్‌ఓవర్ అంటే ఏమిటి?
అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ (NFPA) ప్రకారం.. వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది.. వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా మండే వస్తువులు అన్నీ ఒకేసారి మండిపోతాయని తెలిపింది. ఇక మంటల్లో గది కాలిపోయిందని ఫైర్ సేఫ్టీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ కెర్బర్ అన్నారు.
స్విట్జర్లాండ్ అధ్యక్షుడు విచారం
దుర్ఘటనపై స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తీవ్ర విషాదంగా అభివర్ణించారు. మృతులకు సంతాపంగా ఐదు రోజులు పాటు జాతీయ సంతాప దినాలుగా స్విట్జర్లాండ్ ప్రకటించింది. మరణించిన వారి జ్ఞాపకార్థంగా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై జెండాలను సగం వరకు అవనతం చేయాలని సూచించింది.
🇨🇭⚡ Several people were ki!!ed and others injured after an explosion tore through a bar in the luxury Alpine ski resort of Crans-Montana, Swiss police say.
A cantonal police spokesperson told AFP that the blast was of unknown origin while confirming multiple fatalities. pic.twitter.com/GGbEOvvKrk
— Osint World (@OsiOsint1) January 1, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?