రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో ప్రపంచంలోని సంహభాగం దేశాలు భారీగా అప్పులు చేశాయి. అగ్రదేశాలు సైతం పెద్ద మొత్తంలో అప్పులు చేశాయి. ఆ తరువాత క్రమంగా ఆర్ధికంగా దేశాలు కోలుకోవడంతో అప్పుల భారం తగ్గించుకుంటు వచ్చాయి. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కరోనా విజృంభణ సమయంలో ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు ఐఎంఎఫ్ ప్రకటించింది.
Read: విమానం ఎక్కే అవకాశం లేక…సొంతంగా విమానం తయారు చేశాడు…
ఐఎంఎఫ్ నివేదికల ప్రకారం 2020లో ప్రపంచ దేశాలు 226 లక్షల కోట్ల డాలర్ల అప్పులు చేసింది. ఇందులో అగ్రదేశాల వాటానే అధికంగా ఉన్నట్టు ఐఎంఎఫ్ నివేదిక బయటపెట్టింది. గత 18 నెలల కాలంలో ప్రైవేట్ రంగ సంస్థల కంటే, ప్రభుత్వ రంగ సంస్థలే అధికంగా రుణాలు తీసుకున్నట్టు ఐఎంఎఫ్ ప్రకటించింది. 18 నెలల కాలంలో వివిధ దేశాలు తీసుకున్న రుణాలు జీడీపీలో 99 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ తెలియజేసింది.
Read: అద్దం ముందు అందాల ఆరబోత.. ‘మాస్టర్’ బ్యూటీ ప్రత్యేకత
2008 లో ఆర్థిక సంక్షోభం సమయంలో ఐఎంఎఫ్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు రుణాలు తీసుకునే సదుపాయం కల్పించింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు పెద్ద సంఖ్యలో రుణాలు తీసుకున్నాయి. 2020లో కరోనా సమయంలో భారీ మొత్తంలో అప్పులు చేశాయి. ఆదాయ వనరులు తక్కువగా ఉన్న దేశాలు సైతం సుమారు లక్ష కోట్ల డాలర్లమేర అప్పులు చేసినట్టు ఐఎంఎఫ్ తెలియజేసింది.