NTV WebDesk
Author- NTV Telugu-
జీవో 317పై హైకోర్టులో విచారణ.. స్టేకు నిరాకరణ
తెలంగాణలో రచ్చరేపుతోంది జీవో నెంబర్ 317. ఈ జీవో పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. 371 డి ని పార్లమెంట్ లో ఆమోదించకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదని కోర్టుకు తెలిపారు పిటిషనర్. 317 జీవో పై స్టే ఇవ్వాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య. స్టే ఇవ్వడానికి నిరాకరించారు […] -
ఏపీ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ రాష్ట్రానికి అంతా తామే చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఆడిన మాటను తప్పే వారిని ఏమంటారో బీజేపీ వాళ్లు గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేని బీజేపీ విశాఖ ఉక్కును అమ్మేస్తానంటోంది.ప్రజలు బీజేపీని ఛీత్కరిస్తున్నారు.బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ, […] -
ఏపీ సర్కార్ పై మండలి మాజీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంకి ప్రజలు చరమగీతం పాడాలన్నారు. చంద్రబాబు నాయుడిని ఓడించి తప్పు చేసాం అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. 45 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేసాం అని ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం కి పరిపాలనా యోగ్యత లేదు. ప్రజా వ్యతిరేక ఓట్లు విడిపోకుండా పార్టీలు ఏకం కావాలి. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన వామపక్షాలు ఏకం కావాలని ఆకాంక్షించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి […] -
విశాఖలో జనసేన నిరసన.. భూములు కాపాడాలని డిమాండ్
విశాఖలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. డిఆర్సీ మీటింగ్ ప్రాంగణం బయట జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో పేదలు నిరసనకు దిగారు. అధికారం అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారంటూ స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ జి.వి. విశాఖ ఎంపీ ఎమ్.వి.వి సత్యనారాయణ లకు వ్యతిరకంగా బ్యానర్ల ప్రదర్శన నిర్వహించారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ఎండాడలో సర్వే నెంబర్ 92/3 లో పన్నెండున్నర ఎకరాలభూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. దొంగదారిలో […] -
ఒమిక్రాన్ అలజడి.. దేశంలో 961కి చేరిన కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు అలజడి రేపుతున్నాయి. కేసుల్లో ఢిల్లీని అధిగమించింది మహారాష్ట్ర. పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిసి పెద్ద ఎత్తున సునామీ లాగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించింది డబ్ల్యూహెచ్వో. గతవారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 11 శాతం పెరిగాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం […] -
సినిమా టిక్కెట్ల వివాదానికి సంక్రాంతి లోపు తెర పడేనా.?
ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా […] -
రాజేంద్రనగర్ లో విద్యార్థినిపై అత్యాచారం
మహిళలు, యవతులు, విద్యార్ధినులు అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ముక్కుపచ్చలారని ఓ విద్యార్ధిపై అఘాయిత్యం చేశాడో ప్రబుద్ధుడు. రాజేంద్రనగర్ లో ఈ దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్ధినిపై అత్యాచారం చేశాడో యువకుడు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి తన ఇంటి నుండి మోటర్ సైకిల్ పై హిమాయత్ సాగర్ తీసుకొని వెళ్ళాడా యువకుడు. చెట్ల పొదల్లోకి తీసుకొని వెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ కామాంధుడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించాడు. అత్యాచారం […] -
సిద్దిపేటలో వ్యాక్సిన్ డ్రైవ్..ఇంటింటికీ వెళ్ళి టీకా పంపిణీ
కరోనా వీరవిహారం చేస్తోంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కరోనా బాధితులకు శాపం కానుంది. సిద్దిపేట పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మూడవ వార్డులో యువజన సంఘల సభ్యులు వ్యాక్సిన్ వేసుకోని వారి ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించడం కనిపించింది. వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దంటున్నారు అధికారులు. తెలంగాణలో కరోనా మొదటి డోస్ సుమారుగా వంద శాతం పూర్తయింది. రెండో డోస్ వేయించుకోవడానికి జనం సిద్ధం అవుతున్నారు. కొంతమంది యువత వ్యాక్సిన్ పట్ల […] -
రావులపాలెం ఊబలంకలో ఒమిక్రాన్ కలకలం
ప్రపంచాన్ని ఒమిక్రాన్ కేసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత దేశంలోనూ కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. ఏపీలో బుధవారం ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. రావులపాలెం మండలం ఊబలంకలో మూడు ఒమిక్రాన్ కేసులతో అప్రమత్తం అయ్యారు అధికారులు. ఒమిక్రాన్ కేసులు నమోదైన ప్రాంతంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు పంచాయతీ సిబ్బంది. సౌదీ […] -
నిజామాబాద్ హైవేపై కరెన్సీ నోట్ల కలకలం
నిజామాబాద్ జాతీయ రహదారి పై కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. నోట్లని తుక్కు గా మార్చి తగలబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నోట్లు భారీగానే వున్నట్టుగా చెబుతున్నారు. జిల్లాలోని బుస్సాపూర్ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కనే కనపడిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నారు పోలీసులు. ఒక వాహనం నుండి సంచి పడిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై తగలబెట్టినవి దొంగ నోట్లా అసలు నోట్లా అనే దానిపై విచారణ జరుగుతోంది. జాతీయ […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!