గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా సార్స్‌కోవ్ 2 వైరస్ మొదట చైనాలోని పూహన్‌లో కనిపించింది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యి ఉంటుందని చాలా కాలంగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నది. అయితే, చైనా అలాంటిది ఏమీ లేదని, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని, అక్కడి నుంచి ఇతరులకు వ్యాపించిందని చెప్తూ వచ్చింది. అయితే, కెనడాకు చెందిన నిపుణులు సైతం కరోనా మహమ్మారిపై నివేదికలు తయారు చేశారు.
Read: విప్రో చేతికి అమెరికన్ కంపెనీ…
కరోనా మహమ్మారి చైనాలోని ల్యాబ్ నుంచే లీక్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని కెనాడా నిపుణులు పేర్కొన్నారు. బ్రిటన్ చట్టసభ ఏర్పాటు చేసిన కమిటీకి నిపుణులు నివేదికను అందించారు. పూహాన్‌లో ఈ కరోనా వైరస్ వెలుగు చూసిన విషయాలను చైనా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని, అదేవిధంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణుల బృందం పర్యటనలపై అనేక నిబంధనలు విధించింది, అలానే, వూహాన్‌లో జంతువుల మార్కెట్ నుంచి మనుషులకు కరోనా సోకిందని చెప్పడానికి సరైన ఆధారాలు కూడా లేవని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. దీన్ని బట్టి వూహన్‌లో కరోనా వైరస్ ల్యాబ్ నుంచే వచ్చిందని చెప్పవచ్చని నివేదికలో పేర్కొన్నారు.