తెలుగు రాష్ట్రల్లో వర్షాలు ఇప్పుడు కాస్త తగ్గాయి. అలాగే ఎగువ నుండి కూడా వరద కూడా రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో మాత్రం 21,189 గా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 820 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 40.8748 టీఎంసీలు […]
శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ […]
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 44,111 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,02,362 కి చేరింది. ఇందులో 2,96,05,779 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,95,533 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 738 మంది మృతి […]
ఈ కరోనా కష్ట సమయంలో స్కూలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు. ఫీజు కట్టకపోతే ఆన్ లైన్ క్లాస్ లింక్ లు నిలిపివేస్తామని… పై తరగతులకు ప్రమోట్ చేయమని హెచ్చరిస్తున్నాయి. దాంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై డీఈవో కార్యాలయానికి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఫీజులపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కానీ తల్లిదండ్రులపై ఫీజుల విషయంలో ఒత్తిడి చేస్తే స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం అని డీఈఓ లింగారెడ్డి […]
గూడూరు ప్రేమజంట కేసులో నిందితుడు వెంకటేష్ స్నేహితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారాడు వెంకటేష్ స్నేహితుడు శివ. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు… వెంకటేష్ స్నేహితుడు శివ దొరికితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈరోజు శివను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కూడా కీలకంగా మారింది. అది ఈ […]
తిరుమల శ్రీవారిని నిన్న 14433 మంది భక్తులు దర్శించుకున్నారు. 7570 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా హుండి ఆదాయం 1.34 కోట్లు వచ్చింది. అయితే తాజాగా వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు దర్శనాని వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించిన టీటీడీ ఏఫ్రిల్ 21 నుంచి జూన్ 30వ తేది వరకు వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు ఈ ఏడాది చివరి లోపు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించింది. ఇక జిలేబి, మురుకు […]
మూడు రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. మూడు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. మూడో రోజు కూడా ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.44,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి 48,220 కి చేరింది. గత మూడు రోజులుగా […]
మేషం : ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ఓ మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వృషభం : మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య రంగాలలో వారికి నెమ్మదిగా సంతృప్తి కానవస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. సొంతంగా వ్యాపారం పెట్టాలనే ఆసక్తి మీలో అధికంగా పెరుగును. […]
సింహాచలం భూముల అక్రమాల్లో టార్గెట్ ఫిక్స్ అయిందా? అశోక్ గజపతిరాజు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? త్వరలో కీలక పరిణామాలు ఉంటాయా? సూత్రధారులు.. పాత్రధారుల చిట్టా బయటపడుతోందా? అసలేం జరుగుతోంది? 700 ఎకరాలను ఆలయ రికార్డుల నుంచి తప్పించారా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న సింహాచలం దేవస్థానం భూముల విషయంలో ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విచారణ చేపట్టింది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే రంగంలోకి దిగింది సర్కార్. […]
నాలుగవ తేదీ న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. అందులో హుజూరాబాద్ ఉప ఎన్నిక తో పాటు… రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాల పై చర్చ ఉంటుంది అని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. హైదరాబాద్ తీవ్రవాదులకు అడ్డాగా మారింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చి అక్రమంగా ఉంటున్నారని మేము చెబుతూనే ఉన్నాం. బోధన్, బైంసా, నల్గొండ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా దొంగ పాస్పోర్ట్ లతో ఉంటున్నారు. మత కోణంలో వారి […]