గూడూరు ప్రేమజంట కేసులో నిందితుడు వెంకటేష్ స్నేహితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారాడు వెంకటేష్ స్నేహితుడు శివ. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు… వెంకటేష్ స్నేహితుడు శివ దొరికితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈరోజు శివను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కూడా కీలకంగా మారింది. అది ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. నిందితుడు వెంకటేష్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అదుపులోకి తీసుకొని విచారించునున్న పోలీసులు ప్రస్తుతం తేజస్విని మెడలో దించిన కత్తి కోసం వెతుకుతున్నారు.