మూడు రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. మూడు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. మూడో రోజు కూడా ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.44,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి 48,220 కి చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా ధరలు పెరగడం విశేషం. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ.73,900 కి చేరింది.