ఈ కరోనా కష్ట సమయంలో స్కూలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు. ఫీజు కట్టకపోతే ఆన్ లైన్ క్లాస్ లింక్ లు నిలిపివేస్తామని… పై తరగతులకు ప్రమోట్ చేయమని హెచ్చరిస్తున్నాయి. దాంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై డీఈవో కార్యాలయానికి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఫీజులపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కానీ తల్లిదండ్రులపై ఫీజుల విషయంలో ఒత్తిడి చేస్తే స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం అని డీఈఓ లింగారెడ్డి స్పష్టం చేసారు.