మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 46,617 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,58,251 కి చేరింది. ఇందులో 2,95,48,302 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 5,09,637 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 […]
నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద మూడో రోజు కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. పటిష్ట భద్రత నడుమ ఈ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో 810 మెగావాట్లకు గాను జెన్కో అధికారులు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రానికి వెళ్లే దారి మూసివేసి… తనిఖీ చేసి ఐడి కార్డు ఉంటేనే లోనికి పంపుతున్నారు పోలీసులు. ఏపీ, తెలంగాణ నేతల మాటల తూటాల నేపధ్యంలో ప్రాజెక్టు […]
తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల్లోకి దర్శనాలకు నేటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఇవాళ ఉదయం నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. అన్నవరంలో నేటి నుంచి భక్తులకు సత్యదేవుని వ్రతములు, కల్యాణములు, తలనీలాల సమర్పణకు అవకాశం కల్పించారు. అయినవల్లి , అంతర్వేది, అప్పనపల్లి, కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయాలకు భక్తుల రాక తిరిగి ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.
గూడూరులో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే అది ఆత్మహత్య కాదు హత్య అని అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసారు పోలీసులు. 100 నంబర్ ద్వారా అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కేసు పై విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంకటేష్ స్నేహితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం […]
తమిళనాడులో దారుణం జరిగింది. ఓ అనాధాశ్రమం నుండి 16 మంది పిల్లలు మాయం అయ్యారు. వారు కరోనాతో చనిపోయారని నాటకం ఆడారు ట్రస్ట్ నిర్వాహుకులు. మధురై జిల్లా మేలూరులోని “ఇదయం” ట్రస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వారం క్రితం ఓ బాలుడ్ని ఐదు లక్షల విక్రయించారు ట్రస్ట్ సభ్యులు. అ బాలుడి తల్లి బాబును చూడటానికి వచ్చినప్పుడు కరోనాతో మీ బిడ్డ చనిపోయాడని చెప్పారు సిబ్బంది. అనూమానంతో పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో ట్రస్ట్ […]
పోక్సో కేసుల సత్వర విచారణకు ఏపీలో 16 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసారు. ప్రత్యేక కోర్టుల పరిధిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. చిత్తూరు, తూ.గో, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం,కర్నూలు, కడప, అనంత జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను జిల్లా మొత్తం పరిధిలోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం… విజయవాడ ప్రత్యేక కోర్టు పరిధిలోకి మెట్రోపాలిటన్ ఏరియాను నిర్ధారించించి. మిగిలిన కృష్ణా జిల్లా అంతా మచిలీపట్నం ప్రత్యేక కోర్టు పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ […]
గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 6,328 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 35,315 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 822.30 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 42.6064 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం […]
రెండున్నరేళ్ల డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎంత లేదన్నా పవర్ పవరే కదా? దాన్ని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం లేకుండా తాను సశ్చీలుడునని చెప్పుకొంటున్నారు ఓ డిప్యూటీ సీఎం. అంతేకాదు చివరకు తనకంటే వయసులో చాలా చాలా చిన్నవాడైన సీఎం జగన్ కాళ్లమీద పడ్డారు. ఇవన్నీ ఆయన పవర్ని కాపాడతాయా? నిజాయితీగా పేదవారి కోసం పనిచేశానని చెబుతున్నారుఎవరు కనిపించినా ఒకటే పాట పాడుతున్న డిప్యూటీ సీఎం! మంత్రి పదవి రాగానే ఏసీ […]
ఈ రోజు ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 5.8 కిమీ వరకు వ్యాపించి ఉన్నది. రాగల 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణహెచ్చరికలు:- ఈ రోజు భారీ వర్షములు తెలంగాణాలోని నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాలలో రేపు ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. ఈ […]