తెలుగు చిత్రసీమ నవ్వులతోటలో వాడని పువ్వు అల్లు రామలింగయ్య. ఆయన పంచిన నవ్వులు ఈ నాటికీ సువాసనలు వెదజల్లుతూ కితకితలు పెడుతూనే ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య అంతటి విజయం చూసిన హాస్యనటులు మరొకరు కానరారు. మూడు తరాలుగా అల్లువారి కుటుంబం సినిమారంగంలో అలరిస్తూనే ఉండడం మరో విశేషం! అల్లు రామలింగయ్య హాస్యంలో అల్లుకు పోయే గుణం ఉండేది. ‘అతి’ కనిపించినా, అదీ పాత్రకు అతికినట్టుగానే అనిపించేది. తనకు లభించిన ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ […]
రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అడుగు దూరంలో నిలిచాడు. మరొక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఓపెన్ టెన్నిస్ చరిత్రను తిరగరాస్తాడు. 35 ఏళ్ల స్పెయిన్ బుల్ శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో 7వ ర్యాంకు ఆటగాడు మాటియో బెర్రెటిన్‌ను 6-3, 6-2, 3-6, 6-3తో ఓడించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఈ విజయంతో నాదల్ తన కెరీర్‌లో 29వ సారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగే […]
గోవా బీజేపీలో అసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే నెలలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థుల జాబితా ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 40 శాసన సభ స్థానాలకు గాను గురువారం 34 అభ్యర్థుల పేర్లు వెల్లడించింది . ఐతే, ఎప్పటి లాగే ఇది కొందరికి రుచించలేదు. దాంతో పార్టీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. సిట్టింగ్ మినిస్టర్ తో పాటు మాజీ సిఎం కుమారుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఒక డిప్యూటీ సీఎం భార్య […]
టీమ్ ఇండియా సారధిగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు శనివారం తెరపడింది. కాదు, తనకు తాను తెర దించాడు. ఆయన నాయకత్వంలో టీంఇండియా ప్రతిభతో నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయపథంలో పరుగులు తీసింది. భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన అతిరథ మహారధుడు విరాట్ కోహ్లీ. ఏ ఆటలో అయినా విజయవంతమైన ఆటగాళ్లకు తమదైన ఓ ముద్ర ఉంటుంది. జట్టు సారధికి కూడా తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆటగాడిగా, కెప్టెన్ గా భారత క్రికెట్‌పై కోహ్లీ […]
గత వారం అమెరికా వైద్యులు తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన పంది గుండెను విజయవంతంగా మనిషికి అమర్చారు. సర్జరీ అయిన పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలో అతడు పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు నమ్ముతున్నారు. మరోవైపు, అవయవ మార్పిడిపై జరుగుతున్న ప్రయోగాలలో ఈ సర్జరీ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వైద్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని దశాబ్దాలలో జరిగిన సాంకేతిక అభివృద్ధి ఫలితంగా వైద్య రంగం ఎంతో ముందుకు వెళ్లింది. అనేక వైద్య సదుపాయాలు నేడు […]
రావు గోపాలరావు కొన్నిసార్లు ఎస్వీ రంగారావును తలపిస్తారు. మరికొన్ని సార్లు నాగభూషణాన్ని గుర్తుకు తెస్తారు. కానీ, ఎవరు మరచిపోలేనట్టుగా తన బాణీని పలికిస్తారు. అదీ రావు గోపాలరావు ప్రతిభ. ఆయన లేని లోటు తెలుగు చిత్రపరిశ్రమకు తీరనిలోటు అని బాధపడేవారు ఈ నాటికీ ఎందరో ఉన్నారు. కాలం కొత్తనీటికి తావిస్తూ పోతుందని అంటారు. ఎంత పాతనీరు పోయినా, ఇంకా గోపాలరావు నటన నిత్యనూతనంగానే నిలచింది. ఇంతవరకూ రావు గోపాలరావును మరిపించిన వారు కనిపించలేదు. రావు గోపాలరావులోని ప్రతిభకు […]
‘అందాల నటుడు’ అన్న మాటను ఇంటిపేరుగా మార్చుకున్నారు నటభూషణ శోభన్ బాబు. ఆయన నటజీవితం కూడా అంతే ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగు చిత్రసీమలో తారాపథం చేరుకోవడానికి దాదాపు పుష్కరకాలం ప్రయత్నం సాగించి, చివరకు అగ్రకథానాయకుల సరసన చోటు సంపాదించిన ఘనుడు నటభూషణ శోభన్ బాబు. ఇంతలా స్టార్ డమ్ కోసం తంటాలు పడ్డ మరో స్టార్ హీరో తెలుగునాట మనకు కనిపించరు.ఇద్దరు భామల మధ్య నలిగే పాత్రల్లో పలుమార్లు కనిపించి మురిపించిందీ ఆయనే. నుదుటిపై రింగుపడేలా హెయిర్ […]
“నవ్వడం యోగం… నవ్వించడం భోగం… నవ్వకపోవడం రోగం…” అంటూ ఓ నవ్వుల సూత్రాన్ని జనానికి పరిచయం చేశారు జంధ్యాల. ఇంటిపేరుతోనే రచయితలుగా ఎందరో వెలుగులు పంచారు. వారిలో పసందైన పదాలు పరిచయం చేసిన వారు ఎందరో. అలాంటి వారిలో జంధ్యాల పేరు వినగానె తెలుగుజనానికి కితకితలు పెట్టినట్టు ఉంటుంది. ఒకటా రెండా మరి, జంధ్యాల రచనలో జాలువారిన పదాలయితేనేమి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాల విందులయితేనేమి అన్నీ మనకు హాయిగా నవ్వుకొనే వీలు కల్పిస్తాయి. జంధ్యాల అన్నది […]
ఏ పార్టీకైనా అధికార ప్రతినిధులు బలం. విమర్శలు వచ్చినా.. సమస్యలపై స్పందించాలన్నా.. వాళ్ల పాత్ర కీలకం. కానీ.. ఆ జాతీయపార్టీలో స్పోక్‌పర్సన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవట. డజను మందికిపైగా అధికార ప్రతినిధులున్నా పార్టీ వాయిస్ లేదు..! తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక వేసిన పార్టీ పదవులు అధికార ప్రతినిధుల పోస్టులే. పార్టీకి అధికార ప్రతినిధుల పాత్ర కీలకమని భావించి వాటిని ప్రకటించారు. కాంగ్రెస్ వాయిస్ వినిపించడం.. సమస్యలపై పూర్తి అవగాహనతో స్పందిస్తారని […]
కీలక సమయంలో ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం లైట్ తీసుకుందా? ప్రభుత్వంలోని పెద్దలను కలిసి మాట్లాడుతున్నా.. మార్పు లేదు? ఒకప్పుడు బదిలీలు.. పదోన్నతులు అంటే క్షణం తీరిక లేకుండా గడిపిన టీచర్ల సంఘాల నేతలు.. మౌనంగా ఎందుకున్నారు? ప్రత్యేక రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు నిర్వీర్యం..! తెలంగాణలో 50కి పైగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించేది. ఏదైనా జరుగుతుంది అంటే అందులో తమ ప్రమేయం ఉన్నట్టుగా హడావిడి చేసి ప్రకటనలు […]