తిరుమల శ్రీవారిని నిన్న 14433 మంది భక్తులు దర్శించుకున్నారు. 7570 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా హుండి ఆదాయం 1.34 కోట్లు వచ్చింది. అయితే తాజాగా వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు దర్శనాని వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించిన టీటీడీ ఏఫ్రిల్ 21 నుంచి జూన్ 30వ తేది వరకు వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు ఈ ఏడాది చివరి లోపు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించింది. ఇక జిలేబి, మురుకు ప్రసాదం ధరలను 100 రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది టీటీడీ.